ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. అంటూ స్టార్ట్ అయ్యే సిరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? చిన్న నుంచి పెద్ద వరకూ అందరికీ డాక్లర్ బాబు, వంటలక్క సుపరిచితమే. అయితే ఇందులో అందరిని తన యాక్టింగ్ తో కట్టేసే వంటలక్క పాత్ర చాలా స్పెషల్. దీప క్యారెక్టర్ లో ఆమె పండించే హావ భావాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్న ఫాలోయింగ్ ఆమెకు ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే ఈ వంటలక్క మాత్రం తన పర్సనల్ విషయాలను ఇప్పటివరకూ ఎక్కడా పంచుకుంది లేదు. ఈ మధ్యే మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్న ఈ దీప గురించి అందరికీ ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈ దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ఈ పేరు చాలా మందికి ఈ రోజుకీ తెలియదు. కానీ వంటలక్క అనగానే టక్కున గుర్తు పడతారు.
ఈ ప్రేమి విశ్వనాధ్ ఫస్ట్ మలయాళంలో కారుముత్తు అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. దాంతోనే బుల్లితెరకు పరిచయం అయ్యిందని చెప్పొచ్చు. ఆ సీరియల్ అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో అదే సీరియల్ ను తెలుగులో కార్తిక దీపం పేరుతో తీశారు. ఇక ఇక్కడ ఈ సీరియల్ ఎంత హిట్ అవుతుందో మాటల్లో చెప్పలేమేమో..
అయితే దీప అలియాస్ ప్రేమి విశ్వనాధ్ 1991 డిసెంబర్ 2న కేరళలోని ఎర్నాకుళం అనే ప్రాతంలో పుట్టింది. దీప తండ్రి పేరు విశ్వనాధ్, తల్లి పేరు కాంచన, సోదరుడిపేరు శివ ప్రసాద్. అయితే హీరోయిన్ అనగానే వైట్ గా ఉండాలని అందరూ అనుకుంటారు. అలాగే సినిమాల్లో, సిరియల్లో కనిపిస్తుంటారు. కానీ దీప మాత్రం అలా కాకుండా తన ముఖానికి నలుపు రంగు వేసుకుని యాక్ట్ చేస్తుంది. నేను ఇంతే.. నేను చాల స్పెషల్ అంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకేనేమో.. ఎంతో మంది హృదయాలను ఇట్టే కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.
ఇటు తెలుగు, అటు మలయాళం సీరియల్ లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది. దీప పర్సనల్ జీవితానికి వస్తే.. భర్త పేరు టియస్ వినీత్ భట్. ఆయన ఒక జ్యోతిష్యుడు. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డును కూడా అందుకున్నారు. ఇలా తనగురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియవు. కానీ తన నటన మాత్రం అందరికీ తెలుసు.