NewsOrbit
న్యూస్ సినిమా

వామ్మో.. ఆ షో కోసం సమంత ధరించిన ఈ డ్రస్సు ధర తెలిస్తే గుండే బద్దలవ్వడం ఖాయం!

వెండితెరపై ఏం మాయ చేశావే అంటూ కుర్ర‌కారును మ‌త్తులో దింపిన కుంద‌న‌పు బొమ్మ సమంత‌. ఆ సినిమాతోనే కాకుండా తెలుగు తెర‌పై కీల‌క‌మైన పాత్ర‌ల్లో ఒదిగిపోయి.. త‌న అంద‌మైన న‌ట‌న‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మంలో అగ్ర క‌థాయిక‌గా పేరు సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డి.. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వ‌త కూడా ఈ కుంద‌న‌పు బొమ్మ సినిమాల‌తో పాటు ప్ర‌త్యే క కార్య‌క్ర‌మాల్లో త‌ళుక్కున మెరుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఆమె తాజాగా ప్ర‌ముఖ తెలుగు నిర్మాత అల్లు అర‌వింద్ కు చేందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ “ఆహా”లో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో స‌మంత వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆహాలో “సామ్‌జామ్” పేరుతో రానున్న ఈ కార్య‌క్ర‌మం భారీ స్థాయిలో ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీంట్లో ప్ర‌త్యేకంగా దుస్తుల‌లో మెరిసిపోయారు స‌మంత‌.

ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ ప్రియుల్లోనూ స‌మంత డ్రెస్ గురించే, సామ్ జామ్ ప్రోగ్రామ్ గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? సామ్ ధ‌రించిన డ్రెస్ అంత ప్ర‌త్యేకంగా ఉంది మ‌రి ! ఇప్పుడు అంద‌రి క‌ళ్లు ఆ డ్రెస్ ఖ‌రీదు పైనే ప‌డ్దాయి. కాన్వా ప్లూయిడ్ మ్యాక్సి డ్రెస్ ధ‌రించిన స‌మంతా… ఆ డ్రెస్‌లో అతిలోక సుంద‌రిలా మెరిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

దీంతో ఈ డ్రెస్ ను డిజైన్ చేసింది ఎవ‌రని? దాని ఖ‌రీదు ఎంత ఉంటుంద‌నే విష‌యంపై అంద‌రూ నెట్‌లో తెగ వెతుకుతున్నారు. ఆ వివ‌రాలు మీకోసం.. ! సమంత ధ‌రించిన కాన్వా ఫ్లూయిడ్‌ మాక్సీ డ్రెస్‌ ధర ఆన్‌లైన్‌లో రూ.27,000గా ఉంది. పంక‌జ్ అండ్ నిధి లెబుల్‌పై ల‌భిస్తోంది. దీనిని త‌యారు చేయ‌డానికి ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయ‌గా వ‌చ్చిన ప్ర‌త్యేక వ‌స్త్రాన్ని ఉప‌యోగించార‌ట‌. ఈ ప్రత్యేక డ్రెస్ ధ‌రించిన సమంతా… న‌క్ష‌త్రాకారంలో ఉన్న ఇయ‌ర్ ట‌డ్స్ తో పాటు శంకు ఆకారంలో ఉన్న చేవిపోగుల‌ను ధ‌రించి.. ఆకాశంలో న‌క్ష‌త్ర తార‌ల మెరిశారు. సామ్‌జామ్ కార్యక్ర‌మ ఆవిష్క‌ర‌ణ వేడుక సంద‌ర్భంగా మాట్లాడిన సమంత.. త‌న‌కు ఈ షో చాలా ప్ర‌త్యేకమైంద‌ని తెలిపారు.

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu