NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇటాలియన్ సూపర్ బైక్..! ఫీచర్లు, ప్రతేకతలు తెలుసుకోండి..!

 

డుకాటీ పానిగలే వి 4 ఇటాలియన్ మార్క్ యొక్క స్టైల్-డ్రైవ్, పెర్ఫార్మెన్స్-ఫస్ట్ వీ-ఇంజిన్ స్పోర్ట్ బైక్‌లను ఉత్పత్తి చేస్తూ చరిత్రను కొనసాగిస్తుంది.ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి అందిస్తున్న పానిగల్ సిరీస్‌లో మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది.2021 డుకాటీ పానిగలే వి 4 1103 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంజన్ 214 పిఎస్ @ 13000 ఆర్‌పిఎమ్ శక్తిని, 124 ఎన్ఎమ్ @ 9500 ఆర్‌పిఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. దీని బరువు 198 కిలోలు. ఇందులో ట్యూబ్ లెస్ టైర్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

 

ducati panigal v4

ఫీచర్లు :
ఈ మోటార్‌సైకిల్‌లోని ఇతర డిజైన్ ఫీచర్లలో పొడవైన విండ్‌స్క్రీన్, ఫ్రేమ్ ప్రొటెక్టర్లు, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం పూర్తి డిజిటల్ 5-ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డిస్ప్లే, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ మరియు సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ ఉన్నాయి.పానిగల్ వి4 కంపెనీ ఎస్‌పికి కార్బన్-ఫైబర్ వీల్ అప్‌గ్రేడ్‌ను ఉండటంవలన ఈ మోటారుసైకిల్ 198 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మోటారుసైకిల్ రెండు చివర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి, వాటిపై ముందు, వెనుక వరుసగా పిరెల్లి డయాబ్లో సూపర్‌కోర్సా టైర్లతో సెక్షన్ 120/70 , 200/60 టైర్లు అమర్చారు.

రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు :
ఇందులో రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్‌లు, కార్నరింగ్ ఎబిఎస్ ఇవో, డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి) ఇవిఓ 3, డ్యుకాటి స్లైడ్ కంట్రోల్ (డిఎస్‌సి), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (ఇబిసి) ఇవిఓ,డ్యుకాటి వీలీ కంట్రోల్ (డిడబ్ల్యుసి) ఇవిఓ, ఆటో టైర్ కాలిబ్రేషన్ ఉన్నాయి. వీటని స్విచ్ గేర్ మరియు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

 

 

బ్రేక్స్ :
ముందు వైపు బ్రెంబో నుండి గ్రహించిన డ్యూయెల్ 330 మిమీ డిస్క్ మోనోబ్లోక్ స్టైల్మా ఆర్ 4-పిస్టన్ కాలిపర్స్ , బ్యాక్ సైడ్ ఇలా , బ్రెంబో టూ-పిస్టన్ కాలిపర్ సెటప్‌తో పాటు 245 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

 

యాక్ససరీస్‌ :
డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి కోసం కంపెనీ అనేక యాక్ససరీస్‌ను కూడా అందిస్తోంది. ఇందులో మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్లు, లైసెన్స్ ప్లేట్ మౌంట్ రిమూవల్ ప్లగ్, కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, జిపిఎస్ మాడ్యూల్‌తో డ్యుకాటి డేటా ఎనలైజర్ మొదలైనవి ఉన్నాయి.

టైటానియం అక్రపోవిక్ ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది మరియు ఇది 1,500 యూనిట్లకు పరిమితం చేయబడింది. డ్యుకాటి అందిస్తున్న పానిగల్ వి4 ఎస్ ఇప్పటికే కంపెనీ నుండి లభిస్తున్న ఫుల్లీ లోడెడ్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ కాగా, కంపెనీ ఇందులో కొత్తగా ఓ ట్రాక్ వెర్షన్ మోడల్‌ను ఎస్‌పి బ్యాడ్జింగ్‌తో తయారు చేసింది. కొత్త డ్యుకాటి పానిగల్ వి4 ఎస్‌పి ప్రత్యేకించి రేస్ ట్రాక్‌లను తయారు చేశారు.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju