NewsOrbit
న్యూస్

Decoration: ఇంట్లో  అలంకారం కోసం వీటితో తయారు చేయబడిన వస్తువులు అస్సలు ఉండకూడదు.. అలాగే అక్వేరియం కూడా ??

Decoration: దైవిక శక్తులను  పాడు చేసి
పెంపుడు జంతువులు గా చెప్పబడినవి   కొన్నిటిని మాత్రమే ఇంట్లో పెంచుకోవచ్చు కానీ చేపలు , తాబేలు , పావురాలు , కుందేలు వంటి వాటిని ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు . గబ్బిలం లాంటివి అసలు ఇంటిలోకి వచ్చినా కూడా దోషమే..  ఎందుకంటే కొన్ని జీవులకు వాటి జన్మతః  వ్యతిరేక శక్తులను విడుదల చేసే గుణం కలిగి ఉంటాయి. వాటి నుండి విడుదలైన నెగెటివ్ వైబ్స్  ఇంటి వాస్తు , దైవిక శక్తులను  పాడు చేసి   ఇంట్లోఉండేవారికి  మానసిక , శారీరక ఇబ్బందులను  కలిగిస్తాయి. కొన్ని రకాల జీవులు ఒక్కోసారి ప్రేత ఆత్మలను కూడా మోసుకువస్తుంటాయి అని మన పెద్దలు చెప్పే మాట . వాటివల్ల ఇంటికి కలిగే కీడుకు శాంతి చేసుకునే విధానం లో  ఉదకశాంతి , యజ్ఞము , బ్రాహ్మణులకు దానాదులు వంటివి చేసుకోవాలిసినంత గట్టిగా ఉంటుంది వాటి ప్రభావం.

Decoration:  అక్వేరియం

వీటితో పాటు  కొన్నిరకాల గవ్వలు , శంఖాలు , నత్తగుల్లలతో తయారు కాబడిన   అలంకరణ వస్తవులు , నెమలి కన్నులు , కొన్ని రకాల పక్షుల ఈకలు , జంతువుల కు సంబందించిన వెంట్రుకలు , జంతు చర్మాలు లాంటి వాటిని   శల్యాలు అంటారు . వీటన్నింటిలో సహజంగానే వ్యతిరేక శక్తుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంట్లో  పెట్టుకోకపోవడం మంచిది. వాస్తు ప్రకారం నెమలి ఈక ని ఇంటిలో పెట్టాలి అంటే వాటిని కొన్ని రోజుల పాటు పూజలో పెట్టి ఆ తర్వాత మాత్రమే ఇంట్లో కావలిసిన ప్రదేశం లో పెట్టుకోవాలి. ఇంట్లో అక్వేరియం పెట్టుకుని అందులో  చేపలు , తాబేళ్లు వేసి పెంచుకోవడం అనేది  ఈ మధ్యకాలం లో  చాలా విపరీతం గా కనిపిస్తుంది.  ఇలా పెంచుకోవడానికి  రెండు కారణాలు వున్నాయి ఒకటి అలంకరణ కోసం అయితే  రెండొవది  వాస్తు దోషాలు పోగొట్టుకోవడం కోసం.  వాస్తు కోసం అయితే మత్యయంత్రం పెట్టుకుంటే సరిపోతుంది.   కానీ అందులో  ఉండేది కేవలం చేప బొమ్మ… దానికి బదులుగా నిజమైన చేపలు పెంచుకుంటే ఇంకా మంచికే మంచి జరుగుతుంది  అనే  ఉద్దేశ్యం తో ఇలా చేస్తుంటారు. మనం ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే,   చేపలు  పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో చేపల్ని  నిల్వ ఉంచరు.  ఒకవేళ వుంచవలసి వస్తే ఇంటి బయట కుండీల్లో వేస్తారు.   మనం ఇంట్లో అక్వేరియం  పెట్టుకుని  చేపల్ని పెంచడం వల్ల వాటినుండి వెలువడే నెగిటివ్ ఎనర్జీ  ఇంట్లో అందరిపై పడుతుంది.  మనిషిలోని ఓజో శక్తి  నిపాడుచేస్తుంది . నాడీవ్యవస్థపై ప్రభావంచూపడం వలన  రోగ నిరోధక శక్తిని తగ్గేలా చేస్తుంది. ఆ జీవుల నుండి

ప్రతికూల శక్తులే

బయటకు వచ్చే  వ్యర్దాలు అదే నీటిలో  కలిసిపోయి ఇంట్లో  ఉండే ఆక్సిజన్  కూడా కలుషితం  చేస్తాయి.
అలాగే ఆ జీవులనుండి వెలువడే చిన్న చిన్న శబ్ద తరంగాల వలన  ఇంట్లో వాళ్ళ నరాల బలహీనతలు  వస్తాయి.
మనపెద్దలు స్పష్టంగా  చెప్పిన పెంపుడు జంతువులలో    చేపలు , తాబేళ్లు లేకపోవడానికి  ముఖ్య కారణం వాటి ప్రతికూల శక్తులే అని గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఇంట్లో  అస్సలు పెంచకూడదు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే …  ఇవన్నీ స్వతంత్రగా బ్రతికే  జీవులు కావడం తో  బంధించిన పాపం కూడా మనకు  చుట్టుకుంటుంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju