NewsOrbit
న్యూస్

అతడు జైల్లో ఉంటే ఓకే …బయటకొచ్చాడా ఇళ్ల తాళాలు బ్రేకే !ట్రాక్ రికార్డు చూస్తే అవాక్కే!

మంత్రి శంకర్‌..వయస్సు 60 ఏళ్లు. పేరుకే మంత్రి. కరడు కట్టిన ఘరానా దొంగ. ఎన్నిసార్లు పోలీసులకు చిక్కి జైలుకెళ్లి వచ్చినా మారని కుక్కబుద్ది. జల్సా పురుషుడు. మంత్రి శంకర్ చేసిన చోరీలకు లెక్కేలేదు. దాదాపు నలభై ఏళ్లుగా అన్ని పోలీసు స్టేషన్లకు మంత్రి శంకర్ పేరు సుపరిచితమే. ఘరానా చోరీల్లో ఆరితేరిన తస్కర యోధవృద్ధుడు..చోరకళా తపస్వి. ఇలా ఇతగాడికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే.

మంత్రి శంకర్ 256 కేసుల్లో నిందితుడు..32 సార్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఘరానా ఖైదీ. నాలుగుసార్లు పీడీ యాక్ట్‌..ఇలా మంత్రి శంకర్‌ అలియాస్‌ శివన్న ట్రాక్‌ రికార్డు. ఇన్నిసార్లు జైలుకెళ్లినా అతగాడి దొంగబుద్ధి ఏమాత్రం మారలేదు. ఇతగాడు మంచి జల్సా పురుషుడు కూడా. ముగ్గురు భార్యలు ఉన్నారు. వాళ్లు చాలరన్నట్లుగా మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు.

మంత్రి శంకర్ ఇరవై ఏళ్ల వయసులోనే దొంగతనాలు ప్రారంభించాడు. 60 ఏళ్లు వచ్చినా చోరీలు మానలేదు. పోలీసులు పట్టుకోవటం జైలుకు పంపించటం మానలేదు. అయినా బుద్ధి మార్చుకోలేక మరోసారి పోలీసుల చేతికి మళ్లీ చిక్కాడు. హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శంకర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.12.09 లక్షల నగదు, వెయ్యి గ్రాముల వెండి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.నగర సీపీ అంజనీకుమారు శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి శంకర్ నేరాల చిట్టా గురించి తెలిపారు.

జైలులో చోరకళ అభ్యసించిన ఘనుడు !

సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్‌ అప్పట్లో తన తల్లితో తరచూ గొడవపడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన శంకర్‌ 1979 డిసెంబర్లో తొలిసారిగా ఓ చోరీ చేసి దొంగగా మారాడు. ఈ కేసులో ఆ తర్వాత చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరం కింద పోలీసులకు చిక్కడంతో రిమాండ్‌ నిమిత్తం అప్పటి ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలుకు వెళ్ళాడు. అక్కడే శంకర్‌కు నాటి ఛత్రినాక పోలీసుస్టేషన్‌ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్‌ సింగ్, దీపక్‌ సక్సేనా, నాగులు వద్ద తాళం ఎలా పగులకొట్టాలో బాగా నేర్చుకున్నాడు. అక్కడే జైలులోని వంటగది తాళం పగులకొట్టించి చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి ఇష్టమైంది వండుకుని తినేవారు.

పది సెకండ్లలో ఎలాంటి తాళమైనా ఫట్ !

దొంగతనం చేయాలంటే పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగటం శంకర్ స్టైల్. ఖరీదైన డ్రెస్సులు వేసుకుని..టక్ షూష్ తో పెద్ద ధనవంతుడిలా కార్లలో తిరగుతూ డేగకళ్లతో రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు చక్కగా చోరీకి రెడీ అయిపోతాడు. చోరీ చేసే ఇంటికి దూరంగా వెహికల్ ఆపి..ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’ కానిచ్చేసి చక్కగా వచ్చేస్తాడు. చోరీకి వెళ్లేటప్పుడు చేతిలో చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లను ఉంటే చాలు ఎలాంటి తాళమైనా సరే శంకర్ చేతిలోకి ఊడి రావాల్సిందే. ఎటువంటి స్ట్రాంగ్ తాళం అయినా సరే..ఓన్లీ 10 సెకండ్స్ లో పగులగొట్టేస్తాడు. అర్ధరాత్రి దొంగతనం చేసి ఆ ఇంటి మిద్దె మీద తెల్లవారే వరకు కూర్చుని..మార్నింగ్‌ వాకర్స్‌ హడావుడి మొదలైనప్పుడు వారితో కలసిపోయి చక్కగా వచ్చేస్తాడు.ఒక్కమాటలో చెప్పాలంటే మంత్రి శంకర్ జైల్లో ఉంటే ఓకే …బయటకొచ్చాడా ఇళ్ల తాళాలు బ్రేకే !

 

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju