ట్రెండింగ్ న్యూస్

Jaathi Ratnalu : ‘జాతి రత్నాలు’ సినిమా చూసిన నవీన్ పోలిశెట్టి తల్లిదండ్రుల రియాక్షన్ చూడండి..!

naveen polishetty parents Review on jathirathnalu
Share

Jaathi Ratnalu : నవీన్ పొలిశెట్టి నెలకు లక్షలు కుమ్మరించే జాబ్ ను వదిలేసి లండన్ నుండి వచ్చి ముంబైలో వేషాల కోసం తిరుగుతున్న రోజులు గురించి ఈమధ్య ఎంతోమంది ఇంటర్వ్యూలలో వినే ఉంటారు. అయితే అటువంటి పరిస్థితిని దగ్గరుండి అనుభవించిన అతని తల్లిదండ్రులు ఈ రోజు నవీన్ సక్సెస్ చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకున్నారు.

 

Jaathi Ratnalu naveen parents emotional
Jaathi Ratnalu naveen parents emotional

 ఇది నవీన్ తొలి సినిమా కాకపోయినా ‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా నవీన్ పోలిశెట్టి తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యాడు. ఇన్నాళ్లకు అతను పడిన కష్టం కి ప్రతిఫలం దక్కిందని అందరూ అంటున్నారు. అయితే ‘జాతిరత్నాలు’ సినిమాను చూసిన నవీన్ పోలిశెట్టి తల్లి ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడుస్తూ కొడుకుని గట్టిగా హత్తుకుంది. 

 

ఇక అతని తండ్రి కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. నవీన్ తన తండ్రిని గట్టిగా కౌగిలించుకొని వీపుపై తడుతూ సర్ది చెప్పడం చూసి చాలా మంది నెటిజన్లు ఎమోషనల్ అయిపోయారు. ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం గమనార్హం. ఇప్పటికే 11 కోట్ల భారీ వసూళ్లను ఈ చిత్రం సాధించింది.

 మరొక వారం వరకు ఈ చిత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు.


Share

Related posts

గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేయండి

Mahesh

Shocking : 10 ఏళ్ళ నుండి శవంతో సహజీవనం…! దీన్ని ప్రేమ అనాలా….? పిచ్చి అనాలా?

arun kanna

వామ్మో ! కాంగ్రెస్ లోగుట్టు రాజకీయాలు ఇలా ఉంటాయా?

Yandamuri