జబర్దస్త్ అవినాష్ అనేకంటే ముక్కు అవినాష్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఎవరో అందరికీ తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అందులో ముక్కు అవినాష్ ఒకరు. బుల్లితెరపై జబర్దస్త్ షో వినోదాన్ని పంచడంలో మొదటి స్థానం దక్కిందుకుంది. ఇకపోతే ప్రేక్షకులకు భారీ స్థాయిలో వినోదాన్ని అందిస్తున్న కమెడియన్లలో ఒకరైన ముక్కు అవినాష్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ షోలో ఆఫర్ రావటం వల్ల ఆ షోకు దూరమైన అవినాష్ ప్రస్తుతానికి స్టార్ మా చానల్లో ప్రచారం అయ్యే పలు ప్రోగ్రాములలో కనిపించడంతోపాటు సినిమాలలో కూడా నటిస్తూ మంచి స్పీడుమీద వున్నాడు.
అయితే తాజాగా అవినాష్ తండ్రి కాబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త అవినాష్ దృష్టికి రావడంతో ఈ వార్త గురించి స్పందించి దాని గురించి స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. తన భార్య అనూజ తను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా వీరు ఇద్దరూ వస్తున్న వార్తలో నిజం లేదని తేల్చి చెప్పేసారు. ఒక మీడియాలో అవినాష్ అనుజాతో నిన్ను పనులు చేయొద్దని చెప్పానా.. డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారని.. అసలే నువ్వు గర్భవతివి అని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కామెడీ కోసమే చేశామని, అదంతా నిజం కాదని చెప్పుకొచ్చారు.
ఇకపోతే చాలామంది యూట్యూబ్ చానెల్ వాళ్ళు అనూజ ప్రెగ్నెంట్ అని వార్తలు ప్రచారం చేస్తున్నాయని మేము ఫంక్షన్లకు వెళ్తుంటే ఆ ఫంక్షన్లలో కూడా ఇదే విషయం అడుగుతున్నారని, ఆ విషయం కాస్త ఇబ్బంది పెడుతోందని తాజాగా ఓ మీడియా వేదికగా అవినాష్ అన్నారు. అంతేకాకుండా మా స్నేహితులు, బంధువులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారని అవినాష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మా తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి ఫోన్ చేయటం జరిగింది. మాకు కూడా తెలియని ఈ విషయం గురించి మమ్మల్ని అడిగితే ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాలేదని అవినాష్ తెలిపారు.