తెలుగు బుల్లితెర లో ప్రసారం అయ్యే కామెడీ షో లు అన్నింటిలో జబర్దస్త్ టాప్. దాదాపు 8 ఏళ్లుగా టెలివిజన్ రంగం లో ఎదురు లేకుండా కొనసాగుతున్న ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఎప్పటికప్పుడు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ సరికొత్త కంటెంట్ తో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటుంది. ఇలాంటి సమయంలో జబర్దస్త్ సెట్ లో చోటు చేసుకున్న ఒక ఊహించని పరిణామం బాగా వైరల్ అయిపోయింది.
వివరాల్లోకి వెళితే ఈ మధ్య ఇమాన్యుల్ అనే ఆర్టిస్టు బాగా ఫేమస్ అయిపోయాడు. ఒకటికి నాలుగు టీమ్స్ లో పాత్రలు వేస్తూ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే తేడా లేకుండా అందరి స్కిట్ల లో తన సత్తా చాటుతూ మంచి గుర్తింపు పొందాడు ఇక నిర్వాహకులు కూడా అతనిని ఉపయోగించుకొని కామెడీ స్కిట్ లతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలు పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాంటిక్ సీన్లు కూడా వస్తున్నాయి.
ఈ మధ్య వర్ష – ఇమ్మాన్యుయెల్ ఎంత బాగా హైలెట్ అవుతుంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెవ్వు కార్తిక్ skit చేసిన సమయంలో కళ్లు కనపడని వ్యక్తిగా ఇమాన్యుల్ పాత్ర పోషించాడు. ఇక అదే అదనుగా చేసుకుని వర్ష కు ముద్దు పెట్టాడు. నిజానికి అతను స్కిట్ లో భాగంగా నిజంగా ఆమెకి ముద్దు పెట్ట కూడదు అన్నట్లు అందరూ షాక్ అయిపోయారు. అతను నిజంగానే ముద్దు పెట్టేసరికి రోజా, మనోలతో పాటు వర్ష, కార్తీక్ కూడా షాక్ అయిపోయారు.