జనాలందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్ కామెడీ షో.. ఈ షో కు జనాలు ఎంతగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఆదరణ పొందుతూ జబర్ధస్త్ ముందుకు సాగుతోంది. జనాలల్లో నవ్వుల పువ్వులు పూసేలానే చేస్తూనే ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్న ఎంతో మందికి మంచిలైఫ్ ను అందిస్తున్నది. ఈ షోలో చేసిన చాలా మంది సినిమాల్లోనూ నటించే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇంకొంత మంది కూడా ఆ లీస్ట్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్టార్స్ గా మారి మంచి ఆఫర్ లు అందుకున్న వారిలో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, దనాధన్ దన్ రాజ్, శకలక శంకర్, వేణు లాంటి వారు చాలా మందే ఉన్నారు.
వారు వివిధ సినిమాల్లో నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వీరే కాకుండా ఈ షోలో లేడి గెటప్ లో నున్న కమెడియన్ల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో.. ఆడవారు సైతం అసూయ పడేలా కాటుక కళ్లతో వయ్యారి నడకతో చూస్తేనే ముద్దొచ్చేలా కనిపిస్తుంటారు జబర్దస్త్ లో ఉంటే ఆడవారి గెటప్ లో ఉన్న మగవారు. మరి వాళ్లను చూస్తే మాత్రం వీరు అబ్బాయిలా.. హే కానే కాదు వీరు ఆడవారే అని ఖచ్చితంగా అటుంటారు… అలా రెడీ అవుతారు మరి. ఆక్టింగ్ ఆక్టింగ్ చేస్తూనే ఆడవారుకున్న అందాలను హొయలను చూపెడుతూ.. చేసే వాళ్ల ఆక్టింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండోయ..
వీళ్లు ఎంతలా పాపులర్ అయ్యారంటే వీరు ఆడవారి గెటప్ లో కాకుండా మగవారిలా వారి ఒరిజనల్ ఫేస్ లతో వస్తే వీళ్లెవరూ నేనెప్పుడూ చూడలేదని అనుకుంటారు. నిజమే మరి చాలా మంది కామెడియన్లు ఆడవారి గెటప్ లోనే కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా వారు వారి ఒరిజినల్ గెటప్ లో ఎప్పుడూ కనిపించని వారు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎంతో జనాధారణ సంపాదించుకున్న కామెడిన్ అండ్ వారి ఒరిజినల్ ఫేస్ లు చూపించని వారు శాంతి స్వరూప్, తన్మయ్, మోహన్ లాంటి వాళ్లు. వీళ్ల ఒరిజినల్ ఫేస్ లు ఎలా ఉంటాయో కూడా ఒక అంచనాకు రాని ప్రేక్షకులు ఉన్నారు. అంటే లేడి గెటప్ లోనే వారు అంతలా ఫేమస్ అయ్యారు మరి. ఇదీ కాక వారు ఏ ఈవెంట్ కి వెళ్లినా వారికి మంచి పేరు తీసుకొచ్చిన లేడి గెటప్ లోనే దర్శనమిస్తుంటారు.
కాని ఇంత మంది అభిమానులను, మంచి పేరును తెచ్చి పెట్టిన జబర్దస్త్ మాకు కొన్ని బాధలను కూడా తెస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్ ప్రొగ్రాం కు జబర్దస్త్ మకెడియన్స్ 8 మంది ఒకేసారి వెళ్లారు. వీరంతా లేడి గెటప్స్ లో ఉండే కమెడియన్లు. ఈ సందర్భంగా వారు తమ బాధలను బయటపెట్టరు. వీరు పెళ్లికి పనికి రారు, అసలు వీళ్లకు పెళ్లే కాదని దారుణంగా మా గురించి జనాలు మాట్లాడారని శాంతి స్వరూప్ బాధపడ్డారు. ఇందంతా ప్రొఫేషనల్ లో ఒక భాగంగా చూడకుండా ఇలా నీచంగా మాట్లాడటం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఒక మనసుంటుంది దాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. తమను తాములా అర్థం చేసుకునే అమ్మాయిలు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటామని శాంతి స్వరూప్ తెలిపాడు. మేమంటూ మనుషులమే అన్న సంగతి కూడా సమజం మరిచిందని తన ఆవేదన వ్యక్తం చేశారు కమెడియ్స్.