జబర్దస్త్ లో సుధీర్, రష్మీ జంట ఎలాగో… ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్, వర్ష జంట అలాగ. ఆ జంటకు కూడా ప్రస్తుతం పాపులారిటీ పెరుగుతోంది. ఆ జంట కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే తేడా లేకుండా.. రెండు షోలలో వీళ్లిద్దరు కలిసి తెగ హడావుడి చేస్తున్నారు. తెలుగు బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, రష్మీ తర్వాత అంతగా పాపులారిటీ పొందిన జంట వీళ్లదే కావడంతో… మిగితా టీమ్ లీడర్లు అంతా.. ఈ జంటను తమ స్కిట్ లో పెట్టుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు.

అంతవరకు బాగానే ఉంది కానీ.. స్టేజ్ మీద వీళ్లిద్దరి రొమాన్స్ రోజురోజుకూ ఎక్కువైపోతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. సుడిగాలి సుధీర్, రష్మీ జంటను ఎనిమిదేళ్ల నుంచి చూస్తున్నాం కానీ.. ఏనాడూ వాళ్లు హద్దులు దాటలేదు. వాళ్ల పరిధిలో వాళ్లు ఉన్నారు. కానీ.. ఈ జంట మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది. స్టేజ్ మీదనే వీళ్ల రొమాన్స్ ఇంతలా ఉంది అంటే బయట ఇంకేం చేస్తున్నారో.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలోనూ వీళ్ల రొమాన్స్ డ్యాన్స్ ను చూపించారు. వామ్మో.. మామూలుగా లేదు వీళ్ల రొమాన్స్. ఈ జంటను చూసి రష్మీ కూడా కుళ్లుకుంటోందట. అసలు.. వీళ్లిద్దరి మధ్య ఏముందో? వీళ్లు ఇంతలా స్టేజీ మీద ఎందుకు రెచ్చిపోతున్నారో.. అని మల్లెమాల యాజమాన్యం కూడా తలపట్టుకుంటున్నారట. లేనిపోనిది ఏదైనా అయితే.. జబర్దస్త్ షోకు లేనిపోని చిక్కులు వస్తాయని అనుకుంటున్నారట.
ఏది ఏమైనా.. ఆ జంటకు ప్రస్తుతం బాగానే పాపులారిటీ ఉంది కాబట్టి.. పాపులారిటీ ఉన్నన్ని రోజులు వాళ్లను హైలైట్ చేయడమేనని జబర్దస్త్ యాజమాన్యం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా విడుదలైన ప్రోమోను మీరు కూడా చూడండి.. ఇమ్ము, వర్ష ఎలా డ్యాన్స్ చేశారో మీకు కూడా తెలుస్తుంది.