Immanuel : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ Immanuel తెలుసు కదా. కామెడీలో కింగ్. జబర్దస్త్ లో హైపర్ ఆది తర్వాత అంత క్రేజ్ ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేలే. ఆయన జబర్దస్త్ లోకి వచ్చి కొన్ని రోజులే అయినా.. తన టైమింగ్ కామెడీతో జనాలను తెగ నవ్విస్తుంటాడు. అందుకే ఇమ్మాన్యుయేల్ లేని జబర్దస్త్ ను ఊహించలేం.

ఇమ్మాన్యుయేల్ కు ఉన్న టాలెంట్ కు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. జబర్దస్త్ తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకు కూడా ఇమ్మాన్యుయేల్ కు అవకాశం వచ్చింది. ఇమ్మాన్యుయేల్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో లీడ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు.
అయితే.. ఇమ్మాన్యుయేల్ కామెడీ చేస్తాడని.. కామెడీ కింగ్ అని అందరికీ తెలుసు కానీ.. ఆయన డ్యాన్స్ చేస్తాడని ఎవ్వరికీ తెలియదు.
Immanuel : శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో డ్యాన్స్ తో అదరగొట్టిన ఇమ్మాన్యుయేల్
అయితే.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్ డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. ప్రముఖ ఢీ డ్యాన్సర్ తేజస్వినితో కలిసి ఇమ్మాన్యుయేల్ వేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. వామ్మో.. ఇమ్మాన్యుయేల్ తక్కువోడు కాదు. మనోడి దగ్గర బాగానే కళలు ఉన్నాయి. కామెడీతో పాటు డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడుగా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇమ్మాన్యుయేల్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ను చూసేయండి.