జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోను మించిన కామెడీ షో అయితే ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర మీద రాలేదు. జీ తెలుగులో నాగబాబు జడ్జిగా బొమ్మ అదిరింది కామెడీ షో వచ్చినప్పటికీ.. జబర్దస్త్ నైతే ఆ షో బీట్ చేయలేకపోయింది. జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. గత 8 ఏళ్ల నుంచి ఈ షో సూపర్ సక్సెస్ గా నడుస్తోంది.

అయితే.. జబర్దస్త్ షోకు ఇప్పటి వరకు ఎంతమంది జడ్జిలు మారినా.. రోజా మాత్రం మారలేదు. 8 ఏళ్ల నుంచి తను ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి.. రోజాకు సినిమా ఇండస్ట్రీలో మరోసారి పాపులారిటీని ఇచ్చింది జబర్దస్త్ అనే చెప్పుకోవచ్చు.
ఇక.. జబర్దస్త్ లో మాట్లాడుకోవాల్సిన మరో వ్యక్తి.. హైపర్ ఆది. ఆయన స్కిట్ కు ఉన్న డిమాండే వేరప్పా. అన్ని స్కిట్లు ఒక ఎత్తు అయితే.. హైపర్ ఆది స్కిట్ మరో ఎత్తు. హైపర్ ఆది స్కిట్ ను చూసి నవ్వకుండా ఉండలేరు. పొట్ట చెక్కలు కావాల్సిందే. సెట్ లో కూడా హైపర్ ఆది స్కిట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు.
తాజాగా వచ్చే వారం జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది.. జడ్జి రోజా మీద ఏదో పంచ్ వేయబోయాడు. దీంతో వెంటనే సీరియస్ అయిన రోజా.. చంపేస్తా అంటూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో వెంటనే వేయబోయిన పంచ్ ను ఆపేశాడు హైపర్ ఆది. ఆ తర్వాత ఆ పంచ్ ను అనసూయకు వేసి తప్పించుకున్నాడు.
అయితే.. అది స్కిట్ లో భాగం అయినప్పటికీ.. రోజాకు నిజంగానే కోపం వచ్చిందని.. జడ్జిలను వయసు మళ్లిన వాళ్లు అని అనేసరికి రోజాకు కోపం వచ్చిందంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి వెంటనే హైపర్ ఆది కవర్ చేసుకున్నాడు లేండి. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..