Jabardasth : జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్ల నుంచి అప్రతిహాతంగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక షో జబర్దస్త్. తెలుగులోనే ఈ షో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటి వరకు దీన్ని కొట్టే షో రాలేదు తెలుగులో అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత పాపులారిటీ ఉందో.
జబర్దస్త్ కు ఎంత క్రేజ్ ఉందో.. జబర్దస్త్ లో స్కిట్లు చేసే కంటెస్టెంట్లకు, యాంకర్లకు, జడ్జిలకు.. అందరికీ అంతే క్రేజ్. అయితే.. జబర్దస్త్ లో ఎక్కువ పేరు తెచ్చుకున్నది మాత్రం హైపర్ ఆది. ఆది లేకుండా ప్రస్తుతం జబర్దస్త్ ను ఊహించుకోలేం. అది హైపర్ ఆదికి ఉన్న డిమాండ్.
ఇక.. హైపర్ ఆది.. తన స్కిట్ లో కనీసం ఒక్కసారైనా యాంకర్ అనసూయను తలుచుకోకుండా ఉండలేడు. అనసూయ అంటే ఆదికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అప్పుడప్పుడు అనసూయ మీద తనకు ఉన్న ప్రేమను చూపిస్తుంటాడు హైపర్ ఆది.
Jabardasth : చాన్స్ దొరికితే చాలు.. అనసూయను తెగ పొగిడేస్తున్న హైపర్ ఆది
హైపర్ ఆదికి చాన్స్ దొరికితే చాలు.. యాంకర్ అనసూయను పొగిడేస్తున్నాడు ఆది. తాజాగా విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే కూడా సేమ్.. తన స్కిట్ లో అనసూయను మామూలుగా లేపలేదు. ఈసారి తన స్కిట్ లోకి ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చాడు.
దీంతో అనసూయ.. ఇంత అందమైన అమ్మాయిలు వచ్చారని కుళ్లుకోకు. కావాలంటే నువ్వు కూడా రావచ్చు. ఇక్కడ ఖాళీగానే ఉంది.. అంటూ హైపర్ ఆది అనసూయతో అంటాడు. దీంతో తన స్కిట్ లో ఉన్న అమ్మాయిలు.. ఇక్కడ ఇంతమందిమి ఉన్నాము కదా. మళ్లీ ఆవిడెందుకు.. అనేసరికి.. మీరు అలల లాంటి వాళ్లు.. వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. ఆమె సముద్రం లాంటిది… అక్కడే ఉంటుంది.. అంటూ అనసూయను ఆకాశానికెత్తాడు ఆది. దీంతో అనసూయ ఆనందానికి అవధులే లేవు.
మొత్తం మీద ఆది.. టైమ్ దొరికితే చాలు.. ఆనసూయను తెగ పొగిడేస్తున్నాడు. ఏంటో మరి. సరే.. మొత్తానికి జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను అయితే చూసేయండి.