ట్రెండింగ్ న్యూస్

Jabardasth : జబర్దస్త్ స్టేజ్ మీదనే తాగుబోతు రమేశ్ చెంప చెల్లుమనిపించిన ఇమ్మాన్యుయేల్?

Jabardasth జబర్దస్త్ స్టేజ్ మీదనే తాగుబోతు రమేశ్ చెంప చెల్లుమనిపించిన ఇమ్మాన్యుయేల్
Share

Jabardasth : జబర్దస్త్ Jabardasth  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర మీద టాప్ లో నడుస్తున్న షో అది. ఇప్పుడు కాదు.. దాదాపు 8 ఏళ్ల నుంచి బుల్లితెరను ఏలేస్తోంది జబర్దస్త్ షో. అందుకే.. ఆ షోకు అంత క్రేజ్. ఆ షోలో కామెడీ స్కిట్లు చేసే కంటెస్టెంట్లకు కూడా సినిమాల్లో చాన్సులు వస్తున్నాయి. వాళ్లంతా సెలబ్రిటీలు అవుతున్నారు. అంతా జబర్దస్త్ పుణ్యమాని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది కమెడియన్లు పరిచయం అవుతున్నారు.

Jabardasth latest promo released
Jabardasth latest promo released

Jabardasth : తాగుబోతు రమేశ్ కు స్టేజ్ మీదనే అవమానం?

సాధారణంగా జబర్దస్త్ లో కామెడీ చేసే కంటెస్టెంట్లు ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటి.. స్టేజ్ మీదికి వచ్చాక మరొకటి కూడా చేస్తుంటారు. ఒక్కోసారి కొన్ని డైలాగులు మరిచిపోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి జబర్దస్త్ స్టేజ్ మీద.

అయితే.. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోను చూస్తే తాగుబోతు రమేశ్ కు స్టేజ్ మీదనే ఘోరంగా అవమానం జరిగింది. అయితే.. ఇది కావాలని జరగనప్పటికీ.. స్టేజ్ మీద అందరూ ఉండటంతో తాగుబోతు రమేశ్ కు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు.

నిజానికి తాగుబోతు రమేశ్.. పెద్ద కమెడియన్. ఆయన చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఆయన చాలా సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం ఆయన జబర్దస్త్ లో కామెడీ స్కిట్లను కూడా చేస్తున్నాడు. ఆయన స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్.. ఏదో విషయంలో ఆయన చెంప మీద కొట్టాలి. కానీ.. తొందరపడి నిజంగానే ఇమ్మాన్యుయేల్.. తాగుబోతు రమేశ్ చెంప చెల్లుమనిపించాడు. అరె.. నిజంగానే కొట్టాను అని అనుకున్న ఇమ్మాన్యుయేల్.. సారీ అన్న.. సారీ అన్న.. అంటూ చెప్పడంతో స్టేజ్ మీద ఉన్నవాళ్లు మొత్తం ఒక్కసారిగా నవ్వేశారు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

మరో సారి హైకోర్టు తలుపుతట్టిన ఎస్ఐసి నిమ్మగడ్డ..ఎందుకంటే..?

Special Bureau

సిఇఒ ద్వివేది బదిలీ

somaraju sharma

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కడ?

Mahesh