ట్రెండింగ్ న్యూస్

Jabardasth : ఆన్ స్క్రీన్ మీద హిట్ అవుతున్న మరో జంట.. హైపర్ ఆది, బిగ్ బాస్ రోహిణి కెమిస్ట్రీ అదుర్స్?

Jabardasth latest promo released
Share

Jabardasth : జబర్దస్త్ Jabardasth ప్రోగ్రామ్ ప్రస్తుతం తెలుగులోనే టాప్ కామెడీ షోగా నిలిచింది. తెలుగులో ఎన్నో కామెడీ షోలు వస్తున్నాయి పోతున్నాయి కానీ.. జబర్దస్త్ మాత్రం ఒక ట్రెండ్ ను సృష్టించింది. జబర్దస్త్ వల్ల చాలామంది లైఫే మారిపోయింది. ఎక్కడో ఉన్నవాళ్లను ఎక్కడికో తీసుకుపోయింది ఈ కామెడీ షో.

టాలెంట్ ఉన్నవాళ్లకు మంచి వేదిక జబర్దస్త్. తెలుగులో ప్రస్తుతం టాప్ కామెడీ షోగా ఉన్న జబర్దస్త్ లో ఇప్పటికే పలు జంటలు బయటికి వచ్చాయి. ఆన్ స్క్రీన్ మీద సుడిగాలి సుధీర్, రష్మీ జంట అప్పట్లో సూపర్ హిట్ అయింది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండేది. తర్వాత ఆ జంట కాస్త ఫేడ్ అవుట్ అయిపోయింది.

Jabardasth latest promo released
Jabardasth latest promo released

ఇటీవల ఇమ్మాన్యుయేల్, వర్ష జంట బాగా హల్ చల్ చేసింది. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగానే పండుతోంది. ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ కలిసి స్కిట్ చేస్తే అది హిట్టే ఇక. ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్.

అయితే.. ఈ జంటల లాగానే.. హైపర్ ఆది కూడా తన లేడీ కంపానియన్ కోసం బాగా ట్రై చేస్తున్నాడు. తన స్కిట్ లో చాలామంది అమ్మాయిలను తీసుకొచ్చినప్పటికీ.. ఎవ్వరూ తనకు సరిగ్గా సెట్ కాలేదు. కానీ.. బిగ్ బాస్ రోహిణి మాత్రం హైపర్ ఆదికి కరెక్ట్ గా సెట్ అయినట్టు తెలుస్తోంది.

Jabardasth : హైపర్ ఆదికి జోడిగా రోహిణి

ఈ మధ్య హైపర్ ఆది స్కిట్లలో రోహిణి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తనకు ప్రమోషన్ వచ్చినట్టే. హైపర్ ఆది స్కిట్ లో రోహిణి కన్ఫమ్ అయినట్టే. వీళ్ల జంట కూడా ఈ మధ్య బాగానే ఫేమస్ అవుతోంది. బిగ్ బాస్ రోహిణి, హైపర్ ఆది.. ఇద్దరూ కలిసి తాజా ఎపిసోడ్ స్టెప్పులు కూడా వేశారు. మొత్తానికి జబర్దస్త్ లోకి మరో జంట కూడా వచ్చేసిందన్నమాట. మరి.. ఈ జంట ఎన్నాళ్లు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాల్సిందే.


Share

Related posts

బీజేపీకి భంగపాటు!

Siva Prasad

తెలంగాణ లో తగ్గుముకమ్ పట్టిన కరోనా కేసులు

Siva Prasad

Prabhas Mahesh: సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్, మహేష్..!!

sekhar