Jabardasth : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ప్రస్తుతం తెలుగు టీవీ షోలలోనే టాప్ షో. దీనికి వచ్చే టీఆర్పీ దేనికీ రాదు. అప్రతిహాతంగా చాలా ఏళ్ల నుంచి ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అందుకే… జబర్దస్త్ కు అంత క్రేజ్. జబర్దస్త్ ను ఎక్కువ మంది చూడటానికి ముఖ్య కారణం ఒకరు యాంకర్ అనసూయ అయితే… రెండు హైపర్ ఆది. యాంకర్ అనసూయ తన అందాల్లో పిచ్చెక్కిస్తే…. హైపర్ ఆది మాత్రం తన కామెడీ పంచ్ లతో అందరినీ తెగ నవ్వించేస్తాడు. అందుకే వీళ్లిద్దరికీ తెగ పాపులారిటీ వచ్చేసింది.

ఆన్ స్క్రీన్ మీద యాంకర్ అనసూయ, హైపర్ ఆది జోడి కూడా బాగుంటుంది. చూడముచ్చటగా ఉంటుంది. అందుకే.. హైపర్ ఆది స్కిట్ లో కనీసం ఒక్క డైలాగ్ అయినా అనసూయకు ఉంటుంది. అనసూయ మీద ఏదో ఒక పంచ్ వేయడమో లేదా అనసూయతో కలిసి డ్యాన్స్ చేయడమో… అనసూయకు తన స్కిట్ లో ఒక రోల్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తుంటాడు హైపర్ ఆది.
Jabardasth : లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ హైపర్ ఆది స్కిట్ లో నటించిన అనసూయ
తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ యాంకర్ అనసూయ.. హైపర్ ఆది స్కిట్ లో నటించింది. హైపర్ ఆది భర్తగా నటించింది యాంకర్ అనసూయ. నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తోంది… అంటూ హైపర్ ఆది ఆమెను అడగగా… మీరు ముసలోడు అవ్వకూడదు అనిపిస్తోంది.. అంటూ చాలా రొమాంటిక్ గా సిగ్గు పడుతూ చెప్పేసరికి.. అక్కడున్నవాళ్లంతా ఒకటే నవ్వులు. మీరు మాత్రం ముసలోళ్లు అవ్వొచ్చు కానీ.. మేం ముసలోళ్లం అవ్వకూడదా? అంటూ యాంకర్ అనసూయపై పంచ్ వేయడంతో.. అనసూయ తట్టుకోలేక హైపర్ ఆదిని రెండు పీకింది.
మొత్తానికి వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. జబర్దస్త్ వచ్చే వారం ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.