అయ్యబాబోయ్.. ఏంటి వీళ్లు.. జబర్దస్త్ స్టేజ్ మీదనే ఇలా?

jabardasth latest promo released
Share

జబర్దస్త్.. తెలుగు బుల్లితెర మీద ఈ కామెడీ షోను ఢీకొట్టే షో ఇంతవరకు రాలేదు. అంతలా క్రేజ్ ఉంది ఈ షోకు. దీనికి పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. అదిరింది, బొమ్మ అదిరింది లాంటి షోలు కూడా వచ్చాయి. కానీ.. ఏదైనా జబర్దస్త్ తర్వాతే. జబర్దస్త్ అంటేనే కామెడీకి కింగ్. జబర్దస్త్ కే కాదు.. అందులో స్కిట్లు చేసే కంటెస్టెంట్లకు కూడా చాలా డిమాండ్. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

jabardasth latest promo released
jabardasth latest promo released

తాజాగా జబర్దస్త్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో.. హైపర్ ఆది స్కిట్ లో జడ్జి మనో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆదితో పాటు పక్కనే పడుకొని.. ఏదేదో చేశారు. ఏం చేస్తున్నావు మామా నువ్వు.. అని హైపర్ ఆది అడిగితే… చలేస్తుంది కదా జస్ట్ అలా పట్టుకున్నాను అంటూ మనో చెప్పడం… జస్ట్ అలా పట్టుకున్నావా? నువ్వు పట్టుకున్న ప్లేస్ లో పిండి ఉంటే పరోటా అయ్యేది.. పండు ఉంటే జ్యూస్ అయ్యేది అంటూ తన పంచ్ ను విసిరాడు హైపర్ ఆది.

మొత్తానికి ఇదంతా స్కిట్ కోసమే అయినప్పటికీ.. అలా స్టేజ్ మీద హైపర్ ఆది, మనో ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఇదంతా చేస్తున్నారు కాబట్టి.. వాళ్లను కూడా ఏం అనడానికి లేదు. అదంతా తూచ్.. నటనే కదా. లైట్ తీసుకొని.. ప్రోమోను చూసి ఎంజాయ్ చేస్తే బెటర్.


Share

Related posts

BJP: బీసీ నెత్తిన కమల కిరీటం!పవన్ కి చెక్ పెట్టే తంత్రం!!

Comrade CHE

చేసుకున్న వారికి చేసుకున్నంత… ఏబీ మీకు వర్తించేది ఇదే!!

Comrade CHE

BBUtsavam : నీకోసం నా హార్టే ఇచ్చేస్తా? శ్రీముఖికి ప్రపోజ్ చేసిన బిగ్ బాస్ సోహెల్?

Varun G