Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష Jabardasth Varsha గురించి తెలుసు కదా. ఆమె ప్రస్తుతం పెద్ద సెలబ్రిటీ. బుల్లితెరను ఏలేస్తోంది. ఒక మోడల్ గా సినీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం సెలబ్రిటీగా ఎదిగి.. ఫుల్ టు బిజీ అయిపోయింది వర్ష.
ఎక్కడైనా సరే.. వర్ష గురించి మాట్లాడితే మనం మాట్లాడాల్సిన మరో వ్యక్తి ఇమ్మాన్యుయేల్. అవును.. వర్ష, ఇమ్మాన్యుయేల్.. ఇద్దరూ కలిస్తేనే ఆన్ స్క్రీన్ మీద పండుతుంది. అందుకే.. ఇమ్మాన్యుయేల్, వర్షకు మధ్య ఉన్న రిలేషన్ షిప్పే వేరు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.

జబర్దస్త్ తో పాటు ఇతర ప్రోగ్రామ్స్ లో కూడా వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయడం, స్కిట్ చేయడం, రొమాన్స్.. ఇలా పలు విధాలుగా ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారు.
Jabardasth Varsha : శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్ము, వర్ష సందడి
అయితే.. ఈటీవీలో ఇటీవల ఓ ప్రోగ్రామ్ ప్రారంభం అయింది తెలుసు కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ. అది కూడా ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామే. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం కోసం ప్రత్యేకమైన థీమ్స్ తో ఈ షోను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. బుల్లితెర ప్రేక్షకులు కూడా బాగానే ఈ ప్రోగ్రామ్ ను అలరిస్తున్నారు.
తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే మాత్రం.. ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటో అర్థం అవుతుంది. అరే.. ఇమ్మూ అంటూ స్టేజ్ మీదే ఇమ్మాన్యుయేల్ ను వర్ష అనేసిందంటే.. వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి.