Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి తెలుసు కదా. జబర్దస్త్ తో సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది వర్ష. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. తనకు వచ్చే ఆఫర్లు మామూలుగా లేవు. ఓవైపు టీవీ షోల ఆఫర్లు, మరోవైపు సినిమాల ఆఫర్లు.. మొత్తం మీద వర్ష.. ఇండస్ట్రీలో సెట్ అయిపోయినట్టే.

జబర్దస్త్ వర్ష గురించి చెప్పగానే… మనకు గుర్తొచ్చే మరో పేరు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఉన్న క్రేజే వేరు. వాళ్లిద్దరూ కలిసి కాసేపు స్టేజ్ మీద నిలబడ్డా చాలు… వాళ్లను చూడటానికి కుర్రకారు ఎగబడతారు.
Jabardasth Varsha : అప్పుడే పెళ్లి పీటలు ఎక్కేసిన వర్ష, ఇమ్మాన్యుయేల్
ఆన్ స్క్రీన్ మీద సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఎంత క్రేజ్ ఉందో…. వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే… వీళ్లది కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది… అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. చాలాసార్లు వర్ష… తనకు ఇమ్మాన్యుయేల్ మీద ఉన్న ప్రేమ గురించి స్టేజ్ మీదే చెప్పుకొచ్చింది.. అయితే.. వీళ్లది సుధీర్, రష్మీ జంటలా కాకుండా… ఈ జంట పెళ్లి పీటల దాకా వెళ్లింది.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనే పెళ్లి పీటలు ఎక్కేసింది ఈ జంట. అది కేవలం స్కిట్ కోసమే అయినా.. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరకుంటున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి మరి.