Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష Jabardasth Varsha తెలుసు కదా. ప్రస్తుతం తను ఒక సెలబ్రిటీ. మోడల్ గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వర్ష.. జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ఫేమస్ అయిపోయింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటుంది. వర్ష లేని జబర్దస్త్ ను ఊహించలేం మనం. అది వర్షకు ఉన్న ఫాలోయింగ్. జబర్దస్త్ తో పాటు వర్షకు వేరే షోలలో వర్షకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో కూడా వర్ష పార్టిసిపేట్ చేస్తోంది.

Jabardasth Varsha : అందరినీ ఏడిపించేసిన వర్ష
అయితే.. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద వర్ష అందరినీ ఏడిపించేసింది. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. తన నాన్న గురించి చెబుతూ.. వెక్కి వెక్కి ఏడ్చింది.
తన నాన్నను తలుచుకుంటూ.. నాన్నకు ప్రేమతో అనే పాటకు డ్యాన్స్ చేసి.. అందరినీ మెప్పించింది. కానీ.. తట్టుకోలేక ఏడ్చేసింది. వర్ష నాన్న ఇటీవలే చనిపోయారట. ఆ బాధలో ఉన్న వర్ష.. తన నాన్నను ఓ సారి గుర్తుతెచ్చుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఎప్పుడూ జబర్దస్త్ లో నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉండే వర్ష.. ఒక్కసారిగా ఏడ్వడంతో అందరూ షాక్ అయ్యారు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.