335వ రోజు జగన్ పాదయాత్ర

శ్రీకాకుళం, జనవరి 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 335వ రోజుకు చేరింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం దెవ్వూరు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా పార్టీ జండాను ఆవిష్కరించి, నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. నేడు వంకులూరు, చిన్నవంకులూరు, అనకాపల్లి క్రాస్, రంగోయ్ క్రాస్, శ్రీరాంనగర్, బాహదాపల్లి, నల్లబొడ్డూరు, గుజ్జలూరు, బి జగన్నాధపురం మీదుగా నారాయణపురం వరకూ పాదయాత్ర చేయనున్నారు.