న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మిలాట్… మీరు మాకొద్దు !! జస్టిస్ కన్నీరు X జగన్ తగ్గరు

Share

 

హ హ హ … జగన్ కు కోర్టుల నుంచే కాదు… న్యాయమూర్తుల నుంచి సైతం ప్రతిఘటన తప్పేలా లేదు… ప్రభుత్వం ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ కేసులో హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ను కేసు విచారణ నుంచి తప్పించాలని అఫిడవిట్ దాఖలు చేయడం.. దాని మీద విచారణ జరుగుతున్నా సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి… అయన ఏమన్నారంటే…

** న్యాయమూర్తులపై అనుమానం వ్యక్తం చేస్తుంటే విధులు నిర్వహించడం కష్టమే.. ఇలా ఐతే అన్ని కేసుల్లోనూ మార్పులు కోరే అవకాశం ఉంటుంది.. ఇది ఒకరకంగా న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేసే దిశగా వెళ్లిన ఆశ్చర్యం లేదు.. వృత్తిపరంగా చివరి దశలో ఉన్నప్పుడు కొత్త అనుభవం ఎదురైంది. విచారణ నుంచి తప్పుకోవాలనే కొత్తధోరణి ప్రారంభమైంది. కెరీర్‌ చివరి దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాను’’ అంటూ ఆయన బాధ పడటం ఎప్పుడు చర్చకు దారి తీస్తోంది. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఈనెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.

** తాజాగా… ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ కేసు విచారణ ధర్మాసనంలో కూడా ఆయన ఉండటానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై తేల్చాలని పిటిషన్లు దాఖలు చేయకపోయినా, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తనకు తాను విచారణ జరపడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. విచారణ పూర్తికాక ముందే రాజ్యాంగ విచ్ఛిన్నంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఈ నేపథ్యంలో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఉన్న ధర్మాసనంలో నిష్పాక్షిక విచారణ సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. ఆయన ఉంటె కేసులు ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది అనేది ప్రభుత్వ అభిప్రాయం.
** ఓ పిల్ విషయంలో పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు వివరాలపై వాదనలు వినిపించేందుకు పోలీసుల తరఫు ప్రత్యేక కౌన్సిల్‌కు అవకాశం ఇవ్వలేదని, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినకుండానే రాజ్యాంగ విచ్ఛిన్నంపై ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్‌ చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారని దీనిలో చెప్పుకు వచ్చారు. గురువారం మిషన్‌ బిల్డ్‌ ఏపీ, రాజ్యాంగ విచ్ఛిన్నంతోపాటు… గుంటూరు పాత పోలీసు ఠాణాపై దాడి అంశాలపై జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలి రెండు కేసుల నుంచి తనను తప్పుకోవాలన్న ప్రభుత్వం, గుంటూరు ఠాణాపై దాడి కేసు నుంచీ తప్పుకోవాలని పిటిషన్‌ వేస్తుందేమో అని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. వృత్తిపరంగా చివరి దశలో ఇప్పుడు కొత్త అనుభవం ఎదురైందని, ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై విచారణ ప్రారంభం కాగానే… ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ కల్పించుకుని, విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పిటిషన్లు వేసిందని ధర్మాసనానికి విన్నవించారు.


** రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌ రెడ్డి, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తారని తెలిపారు. విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చడానికి వీల్లేదని సీనియర్‌ న్యాయవాది సీవీ మోహనరెడ్డి పేర్కొన్నారు. విచారణ నుంచి తప్పుకోవాలని గౌరవప్రదంగా విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ వేశామని మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి తెలిపారు. కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.
** సుప్రీం ఇచ్చిన ఆదేశాలు అనుసరమే ప్రభుత్వం తమ అవకాశంగా తమకు అభ్యన్తకరంగా ఉన్న న్యాయమూర్తిని మార్చాలని కోరడం తప్పేమి కాదు. ఒక కేసులో న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహిస్తున్నారు అని భావిస్తే దానికి గల కారణాలు తెలిపి, దానికి తగిన సాక్షాలు జోడించి ప్రమాణ పత్రం దాఖలు చేసి న్యాయమూర్తి మార్పు కోరే వీలుంది. దీన్నే ప్రభుత్వం చేసింది కాబట్టి దీనిలో జస్టిస్ రాకేష్ కుమార్ బాధపడటానికి ఏమి లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదేమి అంత పెద్ద అంశం కాదని, కావాలనే దీన్ని పెద్దది చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అనేది ప్రభుత్వ వాదన.

 


Share

Related posts

‘అవి ‘కూడా దక్కకపోతే చంద్రబాబుకు డిప్రెషన్ గ్యారెంటీ!

Yandamuri

YS Jagan: పేద బ్రాహ్మణులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

sekhar

మౌనంగా ఉంటున్న ఆ బ్రదర్స్ ఎవరు ? ఎందుకు?

Yandamuri