KCR : కేసీఆర్ లాగే… భారీ గుడ్ న్యూస్ సిద్ధం చేస్తున్న జ‌గ‌న్‌

cm kcr delhi tour to complaint on jagan?
Share

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే… ఏపీ ముఖ్య‌మంత్రి వైస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం భారీ గుడ్ న్యూస్ సిద్ధం చేస్తున్నారా? కీల‌క‌మైన ఉద్యోగుల‌ను ఖుష్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ర‌థ‌సార‌థి రెడీ అయ్యారా? అంటే అవున‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే… ఏపీ స‌ర్కారు పీఆర్సీ అమలుపై ఫోకస్ పెట్టింది. దీంతో ఏపీ ఉద్యోగుల్లో ఆశ‌లు మొద‌ల‌య్యాయి.

cm kcr delhi tour to complaint on jagan?

KCR తెలంగాణ పీఆర్సీ తో

తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, ఏపీ సర్కార్‌ కూడా కమిటీ ఏర్పాటు చేయడంతో.. త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేయనుంది.. ఆ గుడ్‌న్యూస్‌ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 11వ పీఆర్సీ ఛైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సర్కార్ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా సీఎం ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు ఏపీ ప్రభుత్వం చోటు కల్పించింది.

కొత్త అప్‌డేట్ …

పీఆర్సీ అమ‌లు విష‌యంలో ముఖ్య‌మైన మ‌రో అంశం ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ విలీనంతో కొత్తగా ఏర్పాటైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.. మొత్తంగా 11వ పీఆర్సీ చేసిన సిఫార్సులపై చర్చించి.. ప్రభుత్వానికి ప్రతిపాదలను చేయనుంది. ఏపీ ప్ర‌భుత్వం వినిపించే తీపి క‌బురు కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ అలా మొత్తం రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Share

Related posts

స్టీఫెన్ రవీంద్ర ఫైలు కదుపుతున్న సీఎం జగన్..! కారణం పెద్దదే..!!

Muraliak

BJP : గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి స్వయంకృతాపరాధమేనా!పోస్టుమార్టం ప్రారంభిన కమలనాథులు!

Yandamuri

Today Horoscope అక్టోబర్ 22nd గురువారం మీ రాశి ఫలాలు

Sree matha