Modi : మోడీ ఏమ‌నుకుంటారో ఆలోచించ‌వా జ‌గ‌న్‌?

Share

Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చేసే కామెంట్ల‌కు, విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా కేంద్రాన్ని ప్ర‌తిఘ‌టించే విష‌యంలో మాత్రం జ‌గ‌న్ దూకుడు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. ఇటీవ‌లే ఏపీకి ప్ర‌త్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం షాక‌య్యే కామెంట్లు పార్ల‌మెంటు సాక్షిగా చేసిన ఏపీ సీఎం దీనికి కొన‌సాగింపుగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని గత వంద రోజులుగా రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి రైతులు దేశవ్యాప్తంగా బంద్ ను నిర్వహించారు. అప్పటి భారత్ బంద్ కు చాలా రాష్ట్రాలు సహకరించాయి. కాగా, ఇప్పుడు మరోమారు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి జ‌గ‌న్ స‌ర్కారు అధికారికంగా మ‌ద్ద‌తు ఇస్తోంది.

నేటి బంద్‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం..

నేడు భారత్ బంద్ కు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. 26 వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోనున్నాయి. బంద్ విష‌యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ… ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న బంద్ కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న బంద్ కు మద్దతు ఇస్తున్నామని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో …

విశాఖ స్టీల్ ప్లాంటును మేం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని పేర్ని నాని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందన్నారు. మొత్తంగా అన్ని అంశాల్లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు వైసీపీ షాకిచ్చింద‌ని అంటున్నారు.


Share

Related posts

అందరికీ రాజమౌళి ఆఫర్ ఇస్తుంటే .. ఈ హాట్ బ్యూటీ రాజమౌళి కె బంపర్ ఆఫర్ ఇచ్చింది.

GRK

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారా? మీ పంట పండినట్లే: చరిత్ర తిరగరాసిన దలాల్ స్ట్రీట్

Special Bureau

బిర్యానీ లో వేసుకునే ఈ పదార్ధం తో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది!!

Kumar