జైలులో పెన్ను పుస్తకం ఇవ్వండి

విజయవాడ, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఎ కోర్టు ఫ్రిబవరి ఎనిమిదవ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో హజరుపరిచారు. న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన కోర్టు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకూ  రిమాండ్‌ విధిస్తూ, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ జైలులో శ్రీనివాసరావును ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచాలనీ, దానితో పాటు పెన్ను, పుస్తకం, న్యూస్ పేపరు అందించాలని అతని తరపు న్యాయవాదులు కోరగా ఎన్ఐఎ కోర్టు అంగీకరించింది.