NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈ “జగ”మంత భజన యమ డేంజర్ : మేలుకో జగన్

 

“జయము జయము చంద్రన్న…. జయము నీకు చంద్రన్న ” అంటూ మహిళలు భజన చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబును కీర్తిస్తూ పాడిన భజన పాట మొన్న అసెంబ్లీలో ప్రదర్శించి బొల్లున నవ్వుకున్న జగన్… ఇప్పుడు అదే తప్పును స్వయానా తన సమక్షంలోనే చేపించుకుంటూ ఏకంగా రాజ్యాంగ వ్యవస్థ మీదే మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారు… దీనివల్ల జగన్కు ఒరిగేది ఏమీ లేకున్నా పోయేది మాత్రం జాతీయస్థాయిలో పరువు పోతుందని ఆయన తెలుసుకోవడం లేదు… (అదెలా అంటే)

భగవద్గీత లోని “సంభావమి యుగే యుగే” శ్లోకాన్ని చెబుతూ శాసనసభలో స్పీకర్ తమ్మినేని జగన్ దేవ దూత అని ఆయన దేవుడు పంపిన వ్యక్తి అంటూ స్పీకర్ కుర్చీ నుంచే భజన చేయడం ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచారం అవుతోంది. ఇప్పటికే జగన్ మీద ప్రత్యర్ధులు వివిధ రకాల ట్రోలింగ్ సామాజిక మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు స్పీకర్ స్థానంలో నిష్పక్షపాతంగా నిర్భయంగా ఎలాంటి స్వార్థపూరితంగా వ్యవహరించకుండా సభను తమ పర బేధం లేకుండా నడిపించాల్సిన బాధ్యత ఉన్న స్పీకర్ తన స్థానం నుంచే ముఖ్యమంత్రి ని పొగడ్తలతో ముంచెత్తడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని న్యాయకోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ భజన వల్ల వచ్చేది ఏమీ లేకున్నా విపక్షాలకు ప్రత్యర్థులకు మంచి స్టఫ్ ను వైయస్సార్ సిపి నాయకులు గనమే అందిస్తున్నారు.

ఎందుకీ పెడ పోకడ

151 సీట్లను గెలుచుకుని వైఎస్ఆర్సీపీ కు తిరుగులేని ఆధిక్యం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు పార్టీ అధినేతకు మాత్రమే భజన చేస్తూ ఆయన స్మరణంతో ఆయన చల్లని చూపు కోసం పాకులాడుతున్నారని ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
* తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తాను ఆపరేషన్ చేసినప్పుడు రోగి గుండె సైతం “జగనన్న జగనన్న ” అని కొట్టుకుంటుంది అనడం ఇప్పటికి ట్రోలింగ్స్ లో మొదటిస్థానంలో ఉంది.
* ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పుష్ప శ్రీవాణి శాసన సభలో “జగన్ అంటే ఒక బ్రాండ్.. దానికి టాగ్ లైన్ చెప్పాడంటే చేస్తాడంతే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యనం ట్రోలింగ్స్ లో రెండో స్థానంలో ఉంది.
* పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఇంకాస్త ముందుకు వెళ్లి సినిమా డైలాగ్ వేసి “నీ నవ్వు వరం… నీ కోపం శాపం… నీ జాలి” శాపం. అంటూ వేసిన డైలాగ్ ట్రోలింగ్ లో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

విధేయత ఇలా ఎందుకు?

జగన్ పార్టీ తరఫున గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలకు ఆయనపై విధేయత ఉండాలి. అయితే దాన్ని ప్రతిసారి చట్టసభల్లో చూపించాల్సిన అవసరం లేదు. శాసనసభ కేవలం ప్రజా సమస్యల మీద, వారి అవసరాల మీద చర్చించడానికి ఉందనే విషయాన్ని శాసనసభ్యులు మర్చిపోతున్నారు. శాసనసభ నిర్వహణ కోసం ప్రతి నిమిషానికి 8 వేల వరకు ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని వారు గుర్తుంచుకుంటే మంచిది. పార్టీ సమావేశాల్లో లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి కీర్తిస్తూ కార్యక్రమాలు చేయడం పర్వాలే కున్న శాసనసభలో ముఖ్యమంత్రి భజన చేయడం ద్వారా ప్రజలకు మరింత చులకన అవుతున్నామని విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు గుర్తు పెట్టుకోవాలి.

ఏకంగా స్పీకర్

భారతదేశ మొదటి స్పీకర్ గణేష్ మౌలా అంకర్ దగ్గర్నుంచి… మొన్నటి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా వరకు అందరూ అధికార పార్టీ నుంచి లేదా అధికార పార్టీ మిత్రపక్షాలకు నుంచి స్పీకర్ స్థానంలో కూర్చున్న వారే. అది రాజ్యాంగబద్ధ పదవి. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. దీన్ని ప్రస్తుత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పూర్తిగా విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభలో స్పీకర్ చైర్ లో కూర్చుని మరి జగన్ భజన చేయడం, ఆ సమయంలో సభలో జగన్ చిరునవ్వులు చిందిస్తూ దాన్ని ఆస్వాదించడం ప్రజలకు చెడు సంకేతాలను ఇస్తుంది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
* తమ్మినేని సీనియర్ పొలిటిషన్. ఆయన ఆమదాలవలస నుంచి గెలిచిన తర్వాత జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. అయితే ధర్మాన కృష్ణదాసును జగన్ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్వహించడంతోపాటు సీనియర్ అయిన తమ్మినేని కి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది అన్యమనస్కంగానే తీసుకున్న తమ్మినేని వచ్చే మంత్రివర్గంలో కచ్చితంగా జగన్ క్యాబినెట్లో మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్న ట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే తమ్మినేని పలుమార్లు జగన్కు రాయబారాలు తన మనసులోని మాట చెప్పుకున్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాల సమయం కావస్తున్న సమయంలో…. జగన్ మొదటి చెప్పినట్లు రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే నేతలంతా తమ తమ పరిధిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని వర్గాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి సమతూకం ఉండేలా మంత్రివర్గం ఉంటుందని ఇప్పటికే జగన్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రివర్గంలో స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఉత్తరాంధ్ర నాయకుడిగా మంచి పేరున్న తమ్మినేని ఖచ్చితంగా ఆయన దృష్టిలో పడాలని ఆయన దగ్గర మంచి పేరు సంపాదించాలనే తలంపుతోనే స్పీకర్ కుర్చీ నుంచి ఇలా భజన మొదలు పెట్టారనేది టిడిపి నాయకులు చెబుతున్న మాట.
ఏదిఏమైనప్పటికీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక విశేష పరిమితులు విశేష అధికారాలు ఉంటాయి. దాన్ని గుర్తెరగాలి. ఆ పదవిలో నీ హుందాతనాన్ని అందరికీ పంచాలి. ఏ పక్షానికి తాను దగ్గర కాదన్నట్లు అతని చర్యలు ఉండాలి. అందర్నీ సమతూకంగా సమానంగా చూస్తూ సభను నడిపిస్తానని భరోసాను సభ్యులకు ఇవ్వాలి. ఇవన్నీ వదిలేసి తమ్మినేని జగన్ కు తన కుర్చీలో నుంచి భజన చేయడం వల్ల రాజ్యాంగబద్ధ పదవిలో అభాసుపాలు అయిందనేది మాత్రం నిజం

author avatar
Special Bureau

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N