NewsOrbit
న్యూస్

జగన్ దూకుడు – నెక్స్ట్ గేర్ మార్చాడు…!

జగన్ అధికారంలోకీ వచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన కానుక… గత ప్రభుత్వంలో ప్రజలు పడిన ఇబ్బందులకు కారణమైన అవినీతిపై ఉక్కుపాదం మోపబోతున్నానని శాంపుల్ ఇవ్వడం! ఆ శాంపుల్ పీస్ గా అచ్చెన్నను అరెస్టు చేయడం అని భావిస్తే… అనంతరం వరుసగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్రలు వరుసగా అరెస్టయ్యారు. అన్నీ అనుకూలంగా జరిగితే… నెక్స్ట్ మరో మూడు నాలుగు పేర్లు ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి… మరో నాలుగైదు రోజుల్లో వారికి కూడా “కన్ ఫాం” అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు వాయిస్ పెంచేశారు… బీసీలపై దాడిగా అభివర్ణించారు! దీంతో తాజాగా వైకాపా నేతలు కూడా వాయిస్ పెంచేశారు!

ఈ క్రమంలో వరసగా తమ నేతలను తీసుకువచ్చి జైళ్ళల్లో పెట్టేస్తున్నారని, బీసీలను అణగదొక్కేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గోల పెడుతున్న సంగతి తెలిసిందే. ఇది దారుణమని ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆ విధంగా జనంలో సానుభూతి పొందాలన్నది టీడీపీ స్ట్రాటజీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా వదిలేస్తే కరెక్ట్ కాదని భావించినq జగన్ & కో.. బాబుకు గట్టి రిటార్టులు ఇవ్వడం మొదలుపెట్టారు! అందులో భాగంగా… ట్రైలర్ అనే మాటలు మొదలెట్టేశారు!

దీనికే గగ్గోలు పెడితే ఎలా… ఇది జస్ట్ ట్రైలర్ మాత్రం… అనంతరం రాబోయే నాలుగేళ్లలో అవిరామంగా గ్రాఫిక్స్ లేని యాక్షన్ మూవీ కనువిందు చేయబోతుంటే… అన్నట్లుగా జగన్ బ్యాచ్ నుంచి బలమైన సౌండ్స్ వస్తున్నాయి! ఈ క్రమంలో… గతంలో తమరు చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయే తప్ప ఇందులో వైకాపా ప్రభుత్వం వచ్చాక కొత్తగా చేసిందేమీ లేదని అంటున్నారు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు.

దీంతో.. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలకు, అరెస్టులపై ఆడుతున్న రాజకీయ ప్లేస్ కి జగన్ & కో నుంచి గట్టి కౌంటర్స్ స్టార్ట్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… “రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇస్తే ఈ కార్యక్రమం ఆగిపోతుందనుకుంటే పొరపాటే…” అని కూడా జగన్ & కో క్లారిటీ ఇస్తోంది!!

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!