NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ పంతం × రాజ్యాంగం : గెలిచేది ఎవరో తెలుసు ప్రజాధనం వృథా తప్ప

 

రాజ్యాంగ బద్ద వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతాయి. వాటికీ తగిన అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఎవరు అధికారం లో ఉన్న లేకున్నా వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయి. స్వతంత్ర వ్యవస్థల మీద పాలకులు యుద్ధం చేయడం వల్ల ఒరిగేదేమి ఉండదు… కోర్టుల్లో మొట్టికాయలు తప్ప… ఇది ఎవరి కోసం అంటే కోర్టులో మరోసారి పరాభవం ఎదుర్కొన్న ఆంధ్ర ప్రభుత్వ తీరు మీదనే…

ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర వ్యవస్థ. దానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. విధులు ఉన్నాయి. వాటి జోలికి పాలకపక్షం పోకూడదు. పోతే ఏమవుతుంది..? ఇప్పుడు ఏపీలో జరిగే రార్ధంతమే జరుగుతుంది. వారి మీద వీరు… వీరి మీద వారు లేఖలు, రాయబారాలు, ప్రెస్ మీట్లు, సమావేశాలు … సాగుతూ ఉంటాయి. అచ్చం ఒక థ్రిల్లర్ సినిమా చుసిన ఫీలింగ్ మీడియాది అయితే, మా నాయకుడికి వ్యతిరేకంగా వెళ్తే ఇక అంతే అని జబ్బలు చరుచుకోవడం కార్యకర్తల పని.. కోర్టు ఫీజుల రూపంలో ప్రజాధనం వృధా అవుతుంటే… సంబరపడేది కోర్టు లాయర్లు…
** నిమ్మగడ్డ రమేష్ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దీనికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలనీ కోరడం… వెంటనే ప్రభుత్వం నుంచి ఈ సమయంలో కరోనా సెకండ్ వెవ్ భయం ఉందని ఇప్పుడు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత అని వాదించడంతో పాటు దీనిపై లేఖలు, ప్రెస్ మీట్లు, మంత్రుల ఘాటు వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు జరిగాయి. అనంతరం ఇటీవల శాసనసభ సమావేశాల్లో సైతం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం తీర్మానం చేసింది. దింతో ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ తో పాటు ఏపీ ప్రభత్వం కోర్టుకు వెళ్ళింది. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గ ఇచ్చిన ఉత్తర్వులుపై స్టే ఇవ్వాలని కోరినా… కోర్టు అది తమ పరిధిలోకి రాదని ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారాల ప్రకారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంత ఎన్నిక కమిషన్ ఇష్టం మేరకు జరుగుతుందని .. దీనిలో స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దింతో మరోసారి ప్రభుత్వానికి హైకోర్టులో పరాభవం తప్పలేదు.
** నిమ్మగడ్డ రమేష్ కరోనా వెవ్ మొదలయ్యే సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారు. ఎన్నికలు మరో వరం రోజుల్లో పూర్తి అవుతాయన్న సమయంలో, ఏకగ్రీవాలు ఎక్కువగా అధికార పార్టీకు అనుకూలంగా ఉన్న సమయంలో నిమ్మగడ్డ ఎన్నికలు నిలిపేయడం జగన్ కు ఎక్కడో చిర్రెత్తుకు వచ్చినట్లు చేసింది. డైరెక్టుగా రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టి మరి కులం పేరుతో సహా నిమ్మగడ్డ ను తిట్టి పోశారు. తర్వాత నిమ్మగడ్డను ఆ పోస్ట్ నుంచి లేపేసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిమ్మగడ్డ మీద పీకల వరకు ఉన్న జగన్… అయన హయాంలో అసలు ఎన్నికలు నిర్వహించకూడదని పంతం మీద ఉన్నారు. మార్చిలో నిమ్మగడ్డ పదవి కలం అయిపోనున్న తరుణంలో ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి, నిమ్మగడ్డ మీద కక్ష తీర్చుకుని తన పంతం నెరవేర్చుకోవాలని జగన్ బలమైన కోరిక…. ఇది బహిరంగ రహస్యం..
** అయితే జగన్ తన వ్యక్తిగత పంతం కోసం రాజ్యాంగ వ్యవస్థల మీద యుద్ధం చేస్తాను అంటే గెలిచే పరిస్థితి ఉండదు అని ముందు గుర్తించాలి. వాటికీ ఉన్న కొన్ని అపరిమిత అధికారాలను కోర్టులు ఏమి చేయలేవు. ఇది కనీసం గుర్తించకుండా కోర్టుల చుట్టూ తిరిగితే… ప్రజాధనం లాయర్ల జేబులు నింపుతుంది తప్ప జగన్ గెలవలేరు.

గత తీర్పులున్నాయి… చుడండి

జగన్ కు ఒక రకమైన పేరు ఉంది. అయన అనుకున్నది కావాలి.. ఎవరు చెప్పిన వినరు అన్నది చాలామంది చెబుతారు… దేశంలో రాజ్యాంగ వ్యవస్థల మీద యుద్దాలు చేసి గెలిచిన వారు చాల తక్కువ. గత కోర్టు తీర్పులను పరిశీలిస్తే ఇది అర్ధం అవుతుంది.
** ప్రస్తుతం రాష్ట్రంలో గొడవ జరుగుతున్నా తరహాలోనే కర్ణాటకలోనూ స్టేట్ ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన వివాదంలో ఆ రాష్ట్ర హై కోర్ట్ రాజ్యాంగ అధికరణ 243 లోని క్లాస్ 3 ప్రకారం ఎన్నికల నిర్వహణ, తేదీలు, ఎన్నికల అధికారుల నియామకం, ఎన్నికల నియమాలు మిగిలిన ఎన్నికల బాధ్యతలన్నీ స్వంతత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎన్నికల కమిషన్కు ప్రభుత్వాలు సహకరించాలని పేర్కొన్నాయి. అంటే మన రాష్ట్రంలో సైతం ప్రస్తుత ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించుకుని ఎన్నిక తేదీలను ప్రకటించింది. ఇది పూర్తిగా వారి విధి. వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రభుత్వానికి వచ్చే అభ్యన్తరం పట్ల కోర్టులు జోక్యం చేసుకోవు.

దీన్ని మళ్ళీ సుప్రీం కోర్టు వరకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది… దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం కాలయాపన తప్ప…. ప్రజా దానం సుప్రీం కోర్టు లాయర్లకు ధారబోయడం తప్ప…. అన్నట్లు సుప్రీం కోర్టు లాయర్ల రేట్లు గంటకు వాదిస్తే లక్షల్లో, కోట్లలో ఉంటాయి… మరి

author avatar
Special Bureau

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?