NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ కాంట్రాక్టు కేటాయింపుపై… లోకేష్ చుట్టూ జగన్ ఉచ్చు…!

అచ్చెన్న జైలుకి వెళ్లారు…, ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లారు..! తర్వాత ఎవరనేది న్యూస్ ఆర్బిట్ ఇది వరకే ఓ కథనంలో చెప్పింది. లోకేష్ ని ఎలా, ఎప్పుడు ఫిక్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం. టీడీపీలో కీలకంగా ఉన్న చంద్రబాబు, లోకేష్ పై కూడా అవినీతి ముద్ర వేసి జైలు ఊచలు లెక్కపెట్టేలా చేయడమే జగన్ ముందున్న తక్షణ వ్యూహం. లోకేష్ కోసం ఆల్రెడీ తెరవెనుక ప్రణాళిక సిద్ధమయినట్టు తెలుస్తుంది. లోకేష్ కంటే ముందుగా అచ్చెన్న తరహాలోనే మరో మాజీ మంత్రి పితాని కూడా అరెస్టు కానున్నారని సమాచారం.

అచ్చెన్నపై ప్రధాన ఆరోపణ ఇదే…!!

అచ్చెన్నపై పేర్కొన్న అభియోగాలు చూస్తే… తప్పుడు కొటేషన్లు, మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్ కొనుగోళ్లు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోళ్లు, ఫర్నీచర్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు, టోల్ ఫ్రీ- ఈసీజీ సర్వీసులు (టెలిహెల్త్), సీవరేజ్ ట్రీట్‌మెంట్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లు వంటి ..మొత్తం 9 అంశాల్లో అక్రమాలు జరిగాయనేది ఆరోపణ. దేనికి ఎవరు బాధ్యులో కూడా విజిలెన్స్ ఇంతకుముందే వెల్లడించింది. ఆ మేరకు అరెస్టు చేశారు. అచ్చెన్న ఇచ్చిన లేఖ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన సిఫార్సు లెటర్ (ఎల్. ఆర్ నెం.1198/ఎం(ఎల్ఎఫ్ఎఫ్, వైఎస్ 5/ 2016, తేదీ: 25 11.2016) నాడు ఇచ్చారు. ఇదే ఆయన మెడకు చుట్టుకుంది.

పితాని కూడా అదే తరహాలో…!!

అచ్చెన్నాయుడు ఇచ్చినట్లుగానే మాజీ మంత్రి, అచ్చెన్న తర్వాత కార్మికశాఖను నిర్వహించిన పితాని సత్యనారాయణ కూడా (నోట్. నెం.18/ఎం(ఎల్ఇటి ఎఫ్/ 2018, తేదీ:09.02.2018) ఓ సిఫార్సు లెటర్ ఇచ్చారు. ఇది కూడా మరో ఆరోపణగా ఉంది. విచారణ లోతుగా వెళ్తే పితాని అనే మరో వికెట్ పై బాల్ సంధించనున్నారు. అయితే పితాని ఎమ్మెల్యే కాదు, అసెంబ్లీలోనూ, బయట కూడా జగన్ ని విమర్శించడం లేదు.

లోకేష్ చుట్టూ ఐటి వల…!!

అచ్చెన్న, పితాని ఓకే… మరి లోకేష్ ఏం చేశారు…? ఆయనను ఎలా ఫిక్స్ చేయబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి వైసిపి నేతలు ముందు నుండి టార్గెట్ చేస్తున్న ఐటి లో కేటాయింపులో తవ్వకాలు జరిగితే సరి. లోకేష్ దొరికినట్టే. అందుకే అదే జరుగుతోంది. గతంలో ఓసారి ప్రభుత్వమే బ్లాక్ లిస్టులో పెట్టిన హరిప్రసాద్ కంపెనీకి రూ. 333 కోట్ల ఫైబర్ గ్రిడ్ కంట్రాక్టు ఇచ్చారని వైసీపీ, జగన్ కూడా ఆరోపించారు. ఇదే తప్పుడు కొంత తవ్వారు.
* ఈ కంపెనీకి అసలు ఆ కాంట్రాక్టు ఎలా ఇచ్చారు..? అంతే కాదు, ప్రభుత్వ ఐటీ కంట్రాక్టుల వాల్యూయేషన్ కమిటీలో ఆ వ్యక్తికి ఎలా స్థానం ఇచ్చారు..? చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ లోనూ, ఈ హరిప్రసాద్ కంపెనీలోనూ ఒక డైరెక్టర్ సేమ్…’’ అని బాబు హయాంలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

andhra pradesh cabinet meeting key decision
andhra pradesh cabinet meeting key decision

లోకేష్ కూడా… దొరికినట్టేనా…?

హరిప్రసాద్ కంపెనీ ‘టెరాసాఫ్ట్‌’కు ఎల్1, ఎల్2 లను కాదని, పౌరసరఫరాల ఈ-పాస్ యంత్రాల సప్లయ్ కంట్రాక్టు ఇస్తే, అవి సరఫరా చేయకపోవడంతో అప్పట్లో దీన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రభుత్వమే. మళ్లీ తనే ఏపీ ప్రభుత్వ ఐటీ వ్యవహారాల కీలకసభ్యుడు అయ్యాడు. రియల్ టైం గవర్నెన్స్, ఏపీ టవర్స్, ఏపీ సైబర్… ఇలా అన్నింటికీ ఆయన సలహాదారు. ఇప్పుడు మళ్లీ ఆయన తెరపైకి వచ్చాడు. దీనిలోని భారీగా ముడుపులు చేతులు మారాయన్నది వైసిపి ఆరోపణ, ప్రాధమికంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించింది.
* సదరు కంపెనీ అనేక అవకతవకలకు పాల్పడిన నివేదికలు జగన్ ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉన్నాయి. అయితే ఎప్పుడు..? మరి ఇటీవల వరస దెబ్బలు తింటున్న జగనన్న.. ఒకవేళ సీబీఐ గనుక సీరియస్‌గా తవ్వితే.., ఏయే ఫైళ్లపై లోకేష్ సంతకాలు చేశాడో కూడా బయటికొస్తుంది. తనను బాధ్యుడిగా సీబీఐ ఫిక్స్ చేస్తుందా..? లేదా..? చూడాలి. కానీ చంద్రబాబుతో పాటు లోకేష్‌ ను కూడా ఫిక్స్ చేసేలా జగన్ విసిరిన అస్త్రమే ఇప్పుడు చర్చనీయాంశం..!! ఏ విధంగా లోకేష్ ను జగన్ ఎలా ఇరుకున పెడతాడో వేచి చూడాలి. దీనిపై మీరేమంటారు..??

author avatar
Srinivas Manem

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N