NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌క్క‌న పెట్టేసినా వంశీకి జ‌గ‌న్ ఎందుకు సీటిచ్చాడు… చ‌క్రం తిప్పిన ఆ ఒక్క‌డు ఎవ‌రు..?

వైసీపీలో టికెట్ల హడావుడి మొదలై వరుసగా జాబితాలు విడుదల చేస్తున్నప్పటి నుంచి గుడివాడ – గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొడాలి నాని – వల్లభనేని వంశీకి జగన్ ఈసారి సీట్లు ఇవ్వ‌రు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి తోడు ఎల్లో మీడియా కూడా గుడివాడ – గన్నవరం సీట్ల విషయంలో నానా హంగామా చేశాయి. దీంతో గుడివాడలో కొడాలి నాని కి మరొకసారి సీటు రాదని ఇటు గన్నవరంలో వంశీకి కూడా సీటు రాదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గుడివాడ సీటు ఎవ‌రో కాపుల‌కు లేదా మ‌రో యాద‌వ నేత‌కు ఇచ్చేస్తున్నారంటూ ఒక్క‌టే ఎల్లో మీడియా ప్ర‌చారం ఊద‌ర గొట్టేసింది.

ఆ త‌ర్వాత ఈ ప్ర‌చారం బాగా ఎక్కువ అవ్వ‌డంతో కొడాలి నాని రంగంలోకి దిగి ఎల్లో మీడియాకు కౌంట‌ర్ కూడా ఇచ్చు కోవాల్సి వ‌చ్చింది. అప్ప‌ట‌కీ గాని గుడివాడ సీటు విష‌యంలో కొడాలి నాని అభిమానుల్లో నెల‌కొన్న ఆందోళ‌న కాస్త చ‌ల్లార‌లేదు. అంత‌కు ముందు కొడాలి నానిని గుడివాడ నుంచి గన్నవరం కు వెళ్లాలని జగన్ ఆదేశించారని.. ఇటు గన్నవరం ఎమ్మెల్యే వంశీని మైలవరం లేదా విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశించారు అంటూ ఒకటే ప్రచారం జరిగింది. దీనికి తోడు వంశీ కూడా నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్గా లేరు.

నియోజకవర్గంలో ఉన్న వంశీ వ్యతిరేకులు.. వైసిపి నాయకులు అందరూ వంశీకి సీటు ఇస్తే ఓడిస్తామంటూ శపథాలు చేసుకుంటూ వచ్చారు. జగన్ చేయించిన సర్వేలలో వంశీకి వ్య‌తిరేకంగా రిపోర్టులు వచ్చాయి. దీంతో సహజంగానే వంశీకి ఈసారి సీటు ఉండదు అనుకున్నారు. వంశీ కూడా నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోవడం… పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పాటు మధ్యలో రెండు సార్లు కొడాలి నానిని వెంటపెట్టుకుని వెళ్లి జగన్ ను కలిసి రావడంతో అసలు ఏం జరుగుతుందో ?ఎవరికీ అర్థం కాలేదు.

అయితే తాజాగా ఈరోజు రిలీజ్ చేసిన జాబితాలో గుడివాడ నుంచి కొడాలి నానితో పాటు గన్నవరం నుంచి వంశీ పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థిత్వాలపై ఇప్పటివరకు నెలకొన్న పెద్ద సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. నానీ సంగతి ఎలా ఉన్నా వంశీకి అయితే ఈసారి కచ్చితంగా గన్నవరం సీటు ఎవరు అని అనుకున్నారు. మ‌రి ఇప్పుడు వంశీకీ జ‌గ‌న్ ఎలా సీటు ఇచ్చారంటే కేవ‌లం కొడాలి నానియే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. నాని జ‌గ‌న్ ద‌గ్గ‌ర గ‌ట్టిగా ఒత్తిడి చేయ‌డంతో పాటు వంశీకి సీటు ఇవ్వ‌క‌పోతే ఆ ఎఫెక్ట్ జిల్లాలో గ‌ట్టిగా ప‌డుతుంద‌ని.. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువుగా ఉన్న చోట్ల‌.. అలాగే క‌మ్మ వ‌ర్గంలోనూ ఆందోళ‌న ఉంటుంద‌ని చెప్ప‌డంతో జ‌గ‌న్ పెద్ద‌గా ఇబ్బంది లేకుడానే వంశీకి సీటు ఇచ్చేశార‌ని టాక్ ?

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N