YS Jagan: దేశంలో హిస్టరీ క్రియేట్ చేసిన జగన్ గవర్నమెంట్..!!

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియాలో కూడా ఈ వైరస్ వల్ల పాలకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇండియా లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాలు ఎక్కువగా ఏపీ లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే. వైరస్ తీవ్రత బట్టి జోన్లుగా కేటాయించటం..తో పాటు వ్యాక్సిన్ విషయంలో జగన్ ఇచ్చిన సూచనలు అదేరీతిలో వైరస్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలకు ప్రభుత్వాలు అండగా ఉండటం వంటివి ఎక్కువగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది.

All set for covid vaccination program tomorrow in AP, YS Jagan to inspect the process

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం దేశంలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా 6 కోట్ల మంది ఉండగా అందులో మూడు కోట్ల మందికి ఇప్పటికే జగన్ ప్రభుత్వం వ్యాక్సిన్ అందించడం జరిగిందట.

 

దీంతో దేశంలోని అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రాలు అయినా ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలను అధికమించి ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో జగన్ ప్రభుత్వం చాలా స్పీడ్ మీద ఉందని మరింత ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా అది తక్కువ టైమ్ లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి వ్యాక్సిన్ అందించే సామర్థ్యం జగన్ ప్రభుత్వానికి ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలోనే సరిపడా డోస్ లు కేంద్రం అందించగలిగితే అతి తక్కువ టైమ్ లోనే దేశంలో వ్యాక్సినేషన్ ఏపీలో చేస్తామని వైసిపి నేతలు పేర్కొన్నారు. ఏది ఏమైనా కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా క్రమంలో.. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సగం మందికి వ్యాక్సిన్ అందించడం విశేషం.


Share

Related posts

కరెంట్ బిల్లు చెల్లించేందుకు కిడ్నీ అమ్మాల్సివస్తుందేమో..! ఎవరన్నారంటే..?

somaraju sharma

LIGER: విజయ్ దేవరకొండ “లైగర్” లేటెస్ట్ న్యూస్..!!

sekhar

మరోసారి నవ్వులపాలు అయ్యిన పాకిస్తాన్

Siva Prasad