NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రీతీ మెడకు చుట్టుకుంటుంది చూసుకో జగన్… ఇది డేంజర్ గేమ్

 

 

ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలంటే పెద్ద ఇష్యూలు జరగక్కర్లేదు.. చిన్న విషయాలు చాలు… ఇప్పుడు జగన్ ప్రభుత్వం సైతం ఓ విషయంలో చెడ్డ పేరు తెచ్చుకునేలా ఉంది. దీన్ని వెంటనే పరిష్కరించకపోతే ఈ చిన్న సమస్యే ఎన్నికల వేళా పెద్ద సమస్య అయి ప్రభుత్వానికి దెబ్బ కొడుతోంది. వెంటనే జగన్ ఈ సమస్య పై నాన్చుడు ధోరణి వీడితే మంచిది. లేకుంటే కొత్త సమస్యలు తెరమీదకు వచ్చే ప్రమాదం ఉంది

(ఇంతకీ సమస్య ఏమిటి అంటే..?)

** కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి (14) ఒక రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వసతి గృహంలోనే ఆత్మహత్య చేసుకుందని స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.
** తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ శంకర్‌.. 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు చెబుతున్నారు.
** తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో సెక్షన్‌ 302, 201, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య సంఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల అనుమానం వ్యక్తం చేసింది.
** సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి వాపోయింది. ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సైతం కలిశారు.
** పవన్ రంగంలోకి దిగిన తర్వాత ఈ విషయం మీద మీడియా ఫోకస్ పెట్టింది. దీనికి ప్రాధాన్యత వచ్చింది. సోషల్ మీడియా లో సైతం జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతీ పేరు మీద ట్రెండ్ సెట్ అవగా, దానికి అన్ని వైపులా మద్దతు పెరిగింది. దింతో కేసు మీద తీవ్ర ఒత్తిడి రావడంతో పాటు దివ్యంగురాలిగా ఉన్న ఓ తల్లి బిడ్డ కోసం చేస్తున్న పోరాటం అందరిని కదిలించింది.
** కర్నూలులో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ చేపట్టిన మార్చ్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దీని మీద ద్రుష్టి నిలిపి కర్నూల్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ సుగాలి ప్రీతీ తల్లి పార్వతిని కలిసి మాట్లాడారు. కేసును ఆ తల్లి కోరినట్లే సిబిఐ కి ఇస్తామని హామీ ఇచ్చారు.

 

అయితే ఇక్కడే అసలు కథ…

కేసును సిబిఐ కి ఇస్తున్నట్లు ప్రభుత్వం జిఓ జారీ చేసింది. దాని తర్వాత చేయాల్సిన ప్రాసెస్ మాత్రం చేయలేదు. కేవలం జిఓ ఇవ్వడం వాళ్ళ సిబిఐ కేసు తీసుకోదు. దానికి ముందుగా ప్రభుత్వం కేసును సిబిఐకు ఇస్తున్నామని దీని మీద అభ్యన్తరాలు ఎవరికీ ఐనా ఉంటె తెలియజేయాలని నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ తర్వాత కేసు సిబిఐ చూడాలని డైరెక్టర్ కు ప్రభుతవం తరఫున చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తే దాన్ని సిబిఐ డైరెక్టర్ అంగీకరిస్తూ కేసు నమోదు చేస్తారు. తర్వాత సిబ్బందిని నియమిస్తారు. ఇదంతా ఓ ప్రాసెస్. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎప్పటికి ఎప్పుడు వచ్చే సమస్యలు ఏమి లేకున్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం… ప్రభత్వ నిర్లక్షాన్ని విపక్షాలు ఎత్తి చూపే అవకాశం ఉంది. ఎన్నికల వేళా ఏది విపక్షాలకు బ్రహ్మాస్త్రం అయ్యే అవకాశం ఉంది.
** నిందితులను జగన్ కాపాడుతున్నారనేది ఇప్పటికే విపక్షాలు చేస్తున్న వాదన. ఒకే సామజిక వర్గం కావడంతో ఈ కేసులోని నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని, కనీసం కేసును సిబిఐ కు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న. కావాలనే జగన్ ఈ చిన్న విషయాన్నీ పెద్దది చేసుకుని… విపక్షాలకు ఒక ఆయుధం ఇస్తున్నారు అనేది సొంత పార్టీ నేతల మాట…

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?