జ‌గ‌న్ ఇంకో సంచ‌ల‌న ప‌థ‌కం… ఇది ప్ర‌జ‌ల ద‌శ మార్చేస్తుంది

Share

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. దీంతో ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలనున తీసుకువచ్చిన సీఎం జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు.

ఏపీ ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందించనుంది . రేషన్‌లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ప్రభుత్వం డెలివరీ చేయనుంది . ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఏపీ ప్ర‌భుత్వం ఏం చేయ‌నుంది?

ఏపీలో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్షేమ పథకం ప్ర‌కారం రాష్ట్రంలో 9260 వాహానాలతో డోర్ డెలివ‌రీ చేయ‌నున్నారు. డెలివరీ ట్రక్కుల్లోనే కటా పెట్టి ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నారు. ట్రక్కులో ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండనుంది. ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టం ఏర్పాటు చేశారు. సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ చేసే వాహానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించింది . టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు సర్కార్ చేసింది.

ఇప్ప‌టికే జ‌గ‌న్ ఆ నిర్ణ‌యాలు…

ఇటీవ‌లే సీఎం జగన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. “జగనన్న జీవక్రాంతి ” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ. 1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకాన్ని మూడు విడుతలుగా అమలు చేయనున్నారు.


Share

Related posts

రామ్ చరణ్ తో లోకేష్..!!

sekhar

‘ఎన్టీఆర్ సహకారం”తో బాబును మరో అదురు దెబ్బ కొట్టనున్న జగన్ !

Yandamuri

Major Teaser: “మేజర్” టీజర్ ను రిలీజ్ చేసిన మహేష్..!!

bharani jella