NewsOrbit
న్యూస్

జగన్ టేబుల్ మీద కీలక రిపోర్ట్… సైన్ పెడితే తలరాతలు మారిపోతాయి!

సినీనటుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని గౌరవమో లేక “మరోరకం” అభిమానమో తెలియదు కానీ… మొదటినుంచీ సినీ జనాలు టీడీపీ వైపే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి! వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినీజనాలు ఆయనను పెద్దగా కలిసిందీ లేదు అభినందించిందీ లేదు! ఈ క్రమంలో ఎప్పుడూ బాబు – టీడీపీ జపం ఎక్కువగా వినిపించే టాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం మరో ముఖ్యమంత్రి దగ్గరకి ఈస్థాయిలో భారీగా భారీ ప్లాన్స్ తో భారీ మీటింగుకు హాజరవుతున్నారు టాలీవుడ్ పెద్దలు అనబడేవారు!

టాలీవుడ్ జనాలు సుమారు ఇరవైనుంచి పాతికమంది ఛలో అమరావతి అనడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అనే చెప్పాలి. వీరిలో టీడీపీ అభిమానులు ఎంతమంది వెళ్తున్నారు.. వైకాపా అభిమానులూ ఎంతమంంది కలవబోతున్నారు.. న్యూట్రల్ గా ఉండేవారి సంఖ్య ఎంత అనే నెంబర్స్ సంగతి కాసేపు పక్కనపెడితే… ఏ విషయంలోనూ తగ్గే ఆలోచన చేయని జగన్… ఇలా తనను కలిసే టాలీవుడ్ జనాల లిస్ట్ లో కూడా కొన్ని మార్పులు కూడా చేశారని తెలుస్తుంది. అసలు జగన్ ను కలవడానికి ఎవరెవరు వస్తున్నారు? వీరి వ్యవహారం ఏమిటి? వీళ్ల పార్టీ ఎఫిలియేషన్లు ఏమిటి? ఇలాంటివి అన్నీ ముందుగానే ముఖ్యమంత్రి జగన్ కు బ్రీఫింగ్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. వీటిలో జగన్ మార్కు కరెక్షన్స్ కూడా జరిగాయని అంటున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది అయినా.. ఇప్పటి వరకు ఆయనను కలిసి అభినందించే పనికి టాలీవుడ్ పెద్దలు అనబడేవారు పూనుకోలేదు. వ్యక్తిగత అవసరాలో, వ్యక్తిగత అభిమానాలో… కారణం ఏదైనా వ్యక్తిగతంగానే వచ్చి బొకేలు ఇచ్చి వెళ్లిపోయారు తప్ప… ఇండస్ట్రీ గా వచ్చి అభినందించింది లేదు. అయితే ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ టాలీవుడ్ పెద్దలతో మీటింగ్ పెట్టి “విశాఖలో సినిమా పరిశ్రమను అభివృద్ది చేయాలని” సీరియస్ ఆలోచనలో వున్నారట. ఇందులో భాగంగా… జగన్ కేటాయించాల్సిన స్థల వివరాలు, స్టూడియోల అభివృద్ధి కోసం ఎవరికి ఎంత స్థలం కేటాయించాలి మొదలైన పూర్తి వివరాలతో జగన్ టేబుల్ మీద కీలకరిపోర్ట్ రెడీగా ఉందంట. ఆ ఫైల్ పై జగన్ ఒక సంతకం పెడితే… ఏపీలో సినిమా ఇండస్ట్రీతోపాటు, చాలామంది తలరాత మారిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆశపుట్టిందో, సొంతగడ్డపై అభిమానం తన్నుకొచ్చిందో తెలియదు కానీ… జగన్ ఆలోచనను అందిపుచ్చుకుని, విశాఖలో స్థలాలు పొందేందుకు టాలీవుడ్ పెద్దలు రెడీ అవుతున్నారంట!

కాగా… రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాప్పుడు కూడా వంద ఎకరాలకు పైగా తెలుగు సినిమా అభివృద్ధి కోసం కేటాయించినప్పుడు… నాకు 10 కావాలి, నాకు 20 ఎకరాలు కావాలని డిమాండ్లు చేశారే తప్ప… ఏపీలో అంతగా ఇండస్ట్రీ అభివృద్ధి చేయ ఎవరూ ఆలోచించలేదని.. ఈమధ్యే ఒక పెద్దయన ఫీలయిన సంగతి తెలిసిందే!

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju