NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మూడు … ముప్పు తిప్పలు … జగన్నాటమ్ లా రాజధానుల వ్యవహారం

 

 

మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ వెనక్కు తగ్గుతారా?? కరోనా తర్వాత పరిపాలన అంతా విశాఖపట్నం తరలి పోతుందా?? బిజెపి నాయకులు చెబుతున్నట్లు ఎప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంద?? ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ గళం విప్పిన జగన్ తర్వాత ఎందుకు మిన్నకుండిపోయారు?? నిజంగానే హైకోర్టు వ్యాఖ్యల వల్ల జగన్ పునరాలోచనలో పడ్డార?? అసలు మూడు రోజుల తరలింపు ఎప్పుడు?? ఇది సాధ్యమా సాధ్యం కాదా అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నిత్యం తొలిచే ప్రశ్నలు. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సమస్య ఏంటి? జగన్ చేసింది కచ్చితంగా తప్పేనా? రాజధానుల తరలింపు పరిపాలన అంశాలను కావాలని జగన్ పెద్దవి చేసుకున్నారా?? అంటే చాలా విషయాలు బయటకు వస్తాయి.

** మూడు రాజధానులు అంశం పై జగన్ శాసనసభ తీర్మానం చేయించడమే పెద్ద సమస్య అయింది. చట్టసభల్లో తీర్మానం మీద కోర్టు కలగ చేసుకోవచ్చు. దీంతో ప్రతిపక్షాలు వెంటనే హై కోర్టు మెట్లెక్కాయి. దీంతో ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం, అవి తర్వాత కోర్టు వాయిదాల్లో ఉండిపోవడం జరిగింది. అసలు ఇంత హడావుడికి జగన్ కారణామనేది న్యాయ, రాజకీయ నిపుణుల మాట.
** ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. దానికి రాజ్యాంగంలో సైతం ఇదే విధమైన అంశం ఉంది. ప్రభుత్వం తనకు అనువుగా ఉన్న చోట పాలన సాగించవచ్చు. వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యలయాలు సౌలభ్యం పేరుతో తెరుచుకోవచ్చు.

 


** అదే పేరు మీద జగన్ చాలా సైలెంట్ గా రాజధానిని (పరిపాలన) విషయాన్నీ విశాఖపట్నం తరలిస్తే పెద్దగా సమస్య ఉండేది కాదు. కొన్ని విషయాల వల్ల, రాజధాని లోని కొన్ని కార్యాలయాలు సాగర తీరం తరలించమని చెప్పుకున్న సమస్య ఉండేది కాదు. జగన్ దీనిపై శాసన సభలో తీర్మానం చేయించండం వల్లనే ప్రస్తుత సమస్యలు వచ్చాయానేది నిపుణులు చెబుతున్న మాట.
** రాజధాని విషయాన్నీ జగన్ రాజకీయంగా వాడుకోవాలని భావించడం వల్లనే చట్ట సభల్లో తీర్మానం చేయించి, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే మంచి ఇమేజ్ వస్తుందని భావించడం వల్లనే సమస్య వచ్చింది. కేవలం కొన్ని కార్యాలయాలను సైలెంట్ గా తరలిస్తే ప్రజలకు దీని మీద అంత దృష్టి ఉండదనే కోణంలో, పార్టీకి తనకు ఇమేజ్ రాదు అన్న కోణంలో మూడు రాజధానుల విషయాన్నీ జగన్ పెద్దది చేసారని వ్యాఖ్యనిస్తున్నారు.
** బీజేపీ ఇప్పుడు ఈ విషయం తన ఖాతా లో వేసుకునేలా పావులు కడుపుతోంది. అమరావతి ని రాజధానిగా ఉంచడానికి అది ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ క్రెడిట్ మాత్రం మొత్తం తన ఖాతాలో వేసుకునేలా గేమ్ ఆడటం బీజేపీ వ్యూహం. దీనికి అన్నీ వైపులా గిరి గిస్తుంది.


** ప్రస్తుతం కోర్టుల బాధలో పడిన రాజధాని తరలింపు విషయంలో జగన్ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. ఒకవేళ రాజధానులు తరలింపు పై వెనక్కు తగ్గితే వైస్సార్సీపీ ప్రభుత్వానికి దెబ్బె. మరోసారి జగన్ వెనకడుగు వేశారని ప్రతిపక్షం చెప్పుకునేందుకు వీలు ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా ముందుకు వెళ్తే కోర్టు వ్యవహారాల్లో నిత్యం సతమతం అవుతున్న జగన్ దీనిలో ఇంకెన్ని ఎదురు దెబ్బలు తినాలో అర్ధం కానీ పరిస్థితి ఉంది.. అయితే మొదటే జగన్ సైలెంట్ గా రాజధాని తరలింపు విషయాన్నీ చక్కబెట్టుకు ఉంటే బాగుండేదని, దానిపై తర్వాత అయినా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే పోయేదాని సొంత పార్టీ నేతల నుంచే వ్యాఖ్యలు వస్తున్నాయి…. అన్నీ అనుకున్నట్టు… లెక్కలో చేస్తే జగన్ ఎందుకు అవుతాడు మరి…

author avatar
Special Bureau

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju