ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

జగన్ బెస్ట్ సీఎం సరే !కెసిఆర్ వరస్ట్ ముఖ్యమంత్రి అట.!‘దేశ్ కా మూడ్’ఇలా వుంది మరి!!

Share

దేశంలోని ముఖ్యమంత్రుల్లో నాలుగో వరస్ట్​ సీఎం కేసీఆర్ అని ఏబీపీ–సీ ఓటర్ తాజా సర్వేలో తేలింది. బెస్ట్​ సీఎంలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు థర్డ్​ ప్లేస్ దక్కింది.

కరోనా క్రైసిస్‌ను దేశం ఎలా ఎదుర్కొంది? ప్రధాని మోడీ పాలన తీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు కలిసి ఇటీవల ఓ సర్వే చేపట్టాయి.ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై 66 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో నాలుగు శాతం మంది ఏమీ చెప్పలే మన్నారు.

పెరిగిపోయిన జగన్ ఇమేజ్!

ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. టాప్ 10 బెస్ట్​ సీఎంలలో మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్, రెండో ప్లేస్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , మూడో ప్లేస్‌లో ఏపీ సీఎం జగన్​ నిలిచారు. జగన్ జాతీయ స్థాయిలో తన మార్క్ చాటుకుంటున్నారు. జాతీయ సంస్థలు చేసే సర్వేల్లో గవర్నెన్స్ పరంగా సత్తా చూపిస్తున్నారు. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ‘దేశ్ కా మూడ్’ పేరుతోఈ సర్వేను నిర్వహించారు. ప్రభుత్వాల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సేకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు, మేనిఫెస్టోలోని అంశాలు, ఎన్నికల హామీలు సహా స్మార్ట్ గవర్నెన్స్, ఇ-గవర్నెన్స్.. వంటి కీలక అంశాలపై ప్రజల నాడి తెలుసుకుంది. సీఎం వ్యవహార శైలినీ కూడా ఇందులో ప్రధానాంశంగా పరిగణించారు. ప్రజల నుంచి వచ్చే సంతృప్తీకరణను ఆధారంగా చేసుకుని స్థానాలు కేటాయించారు. 543 లోక్‌సభ స్థానాల్లో దాదాపు  30 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను 12 వారాల పాటు సంస్థ సేకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయనే విషయం తమ సర్వేలో తేలినట్లు వివరించింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొంది.

టాప్ 5 వరస్ట్​ సీఎంలలో కేసీఆర్!

ఫస్ట్​ వరస్ట్​ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉండగా.. రెండో ప్లేస్‌లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మూడో ప్లేస్‌లో అమరీందర్ సింగ్, నాలుగో ప్లేస్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఐదో ప్లేస్‌లో తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారు.

 


Share

Related posts

ఆయన పిలిస్తే ఆంధ్రాకి వస్తా: అసద్

sarath

Reba monica marvelous images

Gallery Desk

మానుకా తేనే గురించి తెలుసా? అయితే ఇది తెలుసుకోండి!!

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar