దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జగన్ ల్యాప్ టాప్ నిర్ణయం..!!

Share

ఇప్పటికే పలు పథకాలతో దేశవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్నాడు వైఎస్ జగన్. ఈ విషయం పలు పేరుగాంచిన సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో వచ్చిన ఫలితాలు కూడా తెలియజేశాయి. ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో దేశంలో జరిగిన ప్రతి సర్వేలో టాప్ ఫైవ్ లో తన స్థానం ఉండేలా ఏపీలో పరిపాలన అందిస్తున్నారు.

Distribution of house site pattas to poor to continue till January 20: CM  YS Jagan Mohan Reddy- The New Indian Expressఒకపక్క తనపై ప్రతిపక్షాలు మత ముద్ర వేయాలని ఎంత తాపత్రయ పడుతున్న గాని వాటిని పట్టించుకోకుండా జగన్ తన పని తాను చేసుకుంటూ పేదవాడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా వ్యవహరించడం చాలా మంది సీనియర్ రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

 

ఇటువంటి తరుణంలో తాజాగా నెల్లూరు జిల్లాలో రెండో విడత అమ్మ ఒడి పథకం కార్యక్రమంలో ల్యాప్ టాప్ ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేటర్ ఏమిటంటే 25 వేల రూపాయలకు పైగా విలువచేసే ల్యాప్ టాప్ ని కేవలం 18 వేల లోపు అది కూడా పెద్ద పెద్ద కంపెనీల ల్యాప్ టాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జగన్ తెలపడం ఏపీ విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం చాలా వరకు ఆన్ లైన్ తరగతులు జరుగుతున్న క్రమంలో పేదవాళ్లు చాలా వరకు ఈ విద్యకు దూరం అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ల్యాప్ టాప్ లు కూడా అందుబాటులోకి తీసుకు వస్తూ మారుతున్న యుగానికి ప్రభుత్వ నిర్ణయాలు కూడా మారేలా జగన్ వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీలైతే వచ్చే ఏడాది అమ్మ ఒడి పథకం వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తామని జగన్ తెలిపారు.


Share

Related posts

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కీలక వినతి ..! బాధితులకు షాకింగ్ న్యూస్ ఇదీ..!!

somaraju sharma

హ‌త్య చేసి.. ప్లాస్టిక్ సంచిలో శవం.. చివరికి?

Teja

Vithika Sheru New HD Pics

Gallery Desk