NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పోలవరం ఓ రాజకీయ క్రీడ!!

 

 

పోలవరం నిర్మాణం విషయంలో జగన్ కు ఓ దారి దొరికినట్లేనా..? వైయస్ రాజశేఖర్రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం కనుక జగన్ పూర్తి చేయగలరా? ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి దీనికి సహకరిస్తుంద?? పోలవరం ప్రాజెక్టులో కదలిక దేనికి సంకేతం?? జగన్ ధైర్యంతో 2022 నాటికి గ్రావిటీ ద్వారా రబికు నీళ్లు ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంలో ఆంతర్యం ఏమిటి? అసలు పోలవరం నిర్మాణం సాధ్యమేనా?? దీనికి ఉన్న అడ్డంకులు ఏమిటి జగన్ ఇప్పటికిప్పుడు పోలవరం పర్యటన ఎందుకు పెట్టుకున్నారు? అనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

పోలవరం నిర్మాణం విషయంలో పునరావాసం అనేది ప్రధాన అడ్డంకి. దాదాపు లక్షా 5 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. దీనికోసం సుమారు 35 వేల నుంచి 40 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందే పునరావాసం పూర్తిచేసి తర్వాత ప్రాజెక్టు పనులకు వెళ్లాలి. అయితే 373 గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉండడంతో, ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదట మొదలు పెట్టారు. పునరావాసం లో భాగంగా కనీసం ఐదు వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పించలేదు. ప్రాజెక్టు వ్యయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 18 వేల కోట్లు గా ఉన్న పోలవరం నిర్మాణ వ్యయం ఇప్పుడు సుమారు 58 వేల కోట్లకు చేరింది.
** పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా కొర్రీలు పెడుతుంది. 2014 15 అంచనాలకు సంబంధించిన పోలవరం వ్యయం మాత్రమే ఇస్తామని, పవర్ ప్రాజెక్టు తాగునీటికి సంబంధించిన అంశాలను తమ పట్టించుకోమని మొండికేస్తోంది. 2014 కి ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద పెట్టిన విషయాన్ని కేంద్రం భరించలేని, విభజన చట్టం తర్వాత పోలవరం జాతీయ హోదా వచ్చిన తర్వాత పెట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. సుమారు 22 వేల కోట్ల వేయని మాత్రమే ఇస్తామని దీనిలో ఇప్పటికే ఇచ్చిన ఎనిమిది వేల కోట్లు వరకు ఉందని మిగిలిన ఏడు వేల కోట్ల వరకు మాత్రమే పోలవరం నిర్మాణానికి ఇస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది.


** పోలవరం నిర్మాణం విషయంలో ఏడు వేల కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోదు. కనీసం స్పిల్వే నిర్మాణ పనులు పూర్తి కావు. రాష్ట్ర ప్రభుత్వం తాజా కోరిక మేరకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సవరించిన అంచనాలను పోలవరం నిధులు విడుదల చేయాలని కోరుతోంది. తాగునీరు, విద్యుత్ సబ్ వే పనులు కేంద్రమే చేయాలని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సమయంలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణ విషయాన్ని కేంద్రమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ఎం హామీ వచ్చి ఉంటుంది??

తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం సోమవారం ప్రాధాన్యమిచ్చి ప్రతి సోమవారం పోలవరం పనులు మీద సమీక్ష చేసేవారు. కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమే పెద్ద తప్పు. ఈ విషయంలో చంద్రబాబు తన అనుయాయులకు టెండర్లు ఇప్పించుకునే ప్రక్రియలో భాగంగా పోలవరాన్ని రాష్ట్రప్రభుత్వం చేపడుతుందని, అనుకూలంగా అనుగుణంగా పనులు చేస్తామని కోరి మరీ తెచ్చుకున్నారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కు నెట్టేసింది. అప్పట్లోనే పోలవరం విషయంలో చంద్రబాబు ఏటీఎం గా ఉపయోగించుకుంటున్నారని పోలవరం విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఓ సభలో వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో 1300 కోట్ల మిగిల్చావు అని చెబుతున్నా, పనుల్లో మాత్రం అంత వేగం లేదు. కేంద్రం మరోపక్క కొర్రీలు పెడుతూ పోలవరం అంచనాల మీద ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోంది.


** ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంచనాల మేరకు పోలవరం నిధులు ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖకు అర్జీల మీద అర్జీలు పెడుతోంది. దీనిమీద సానుకూల స్పందన వచ్చాయని చెబుతున్న అవి ఎలాంటి స్పందన లేదు మొత్తం దీనికి భాజపా ప్రభుత్వం అనేది పెద్ద ప్రశ్న. ఎలాంటి హామీ ఎలాంటి సానుకూల సంకేతాలు పోలవరం మీద కనిపించకుండానే జగన్ అకస్మాత్తుగా పోలవరం మీద కీలక వ్యాఖ్యలు చేయనని 2022 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే పోలవరం నిర్మాణ విషయంలో పనులు మరింత వేగం పుంజుకోవాలి అంటే దానికి నిధులు అడ్డంకి తొలగిపోవాలని నిపుణుల మాట.
** పోలవరం నిర్మాణాన్ని జగన్ పూర్తి చేస్తే లేక 2022 నాటికి గ్రావిటీ ద్వారా రబి పంట కు నీళ్లు ఇవ్వగలిగితే జగన్ ప్రభుత్వానికి అది పెద్ద ప్లస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ జగన్ కు ఎంత మైలేజ్ ఇచ్చే పనిచేస్తుందా అనేది సందేహమే.
** ఒకవేళ జగన్ ప్రభుత్వానికి నిధుల విషయంలో హామీ వస్తే దానికి ప్రతిగా బీజేపీ పెద్దలు అప్పగించిన పని ఏంటి? నిజంగానే అన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంటుందా? అనేది సందేహమే.
** పోలవరం విషయంలో మరో వాదన బలంగా వినిపిస్తోంది. పోలవరం నిధులు ఇస్తూనే జగన్తో తమకు కావాల్సిన పనులు చేయించుకుని పోలవరం క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాలోకి వచ్చేలా బిజెపి పెద్ద వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. పోలవరం ఖాతాను బిజెపి ఖాతాలో వేసుకుంటే ఆంధ్రాలో పాతుకుపోవడం సాధ్యం అని బీజేపీ భావిస్తోంది. దీంతో ఇప్పుడు పోలవరం విషయంలో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. ఎం జరగబోతుంది అన్న విషయం ఆసక్తి కరంగా సాగుతోంది.

author avatar
Special Bureau

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju