NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

హైకోర్టు సాక్షిగా ఒకే రోజు రెండు సార్లు పరువు పొగొట్టుకున్న జగన్ సర్కార్

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కు హైకోర్టు నుండి ఎదురు దెబ్బలు తగలడం పరిపాటిగా మారింది. పరిపాలనా విషయంలో తన దైన ముద్రతో ముందుకు సాగుతూ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పాలనా పరమైన విషయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. అయినప్పటికీ గత ఏడాది వరకూ దాదాపు 80కి పైగా ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. పలు కేసుల్లో అయితే హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలూ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి అధికారులను కోర్టు బోనులో నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి.

Jagan Sarkar, who was disgraced twice in the same day as a High Court witness
Jagan Sarkar who was disgraced twice in the same day as a High Court witness

హైకోర్టు తప్పుబడుతున్న అంశాల విషయంలో ప్రభుత్వం న్యాయ సమీక్ష చేసుకోకుండా చంద్రబాబు మేనేజ్ మెంట్ వల్లనే హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని ఆరోపణలు చేయడం ప్రారంభించింది. హైకోర్టు తప్పు పట్టిన అంశాలపై సుప్రీం కోర్టుకు వెళుతున్నా ఒకటి రెండు మినహా మిగిలిన అంశాలు అక్కడా వీగిపోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని ప్రచారం చేసి జనాలలో సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఏకంగా న్యాయమూర్తులపైనే దురుద్దేశాలను ఆపాదిస్తూ సూప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు కూడా రాశారు. అనంతర పరిణామాల క్రమంలో దేశ వ్యాప్తంగా పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలో భాగంగా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా బదిలీ అయితే అది తమ ఒత్తిడి వల్లే ఒత్తిడి వల్లే జరిగింది అంటూ ప్రచారం చేసుకుంది. కొత్త న్యాయమూర్తి వచ్చేశారు. ఇక ప్రభుత్వానికి అన్ని సానుకూల తీర్పులే వస్తాయని మాట్లాడుకున్నారు. జడ్జిలుగా ఎవరు ఉన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగం, చట్టపరిధిలో ఉన్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇస్తారే తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా రైట్ రైట్ చెప్పే అవకాశం లేదు.

 

అందుకే న్యాయమూర్తులు మారినా హైకోర్టు నుండి చట్టాలు, రాజ్యాంగానికి లోబడే తీర్పులు వస్తున్నాయి. తాజాగా రెండు కీలక విషయాల్లో జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ తరువాత వాటిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. తీరా ఈ కేసు న్యాయ సమీక్షలో నిలవలేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం చట్టంలోనే లేదనిీ, క్రిమినల్ కేసు కిందకు రాదని కోర్టు తేల్చేసింది, ఆ కేసులను కొట్టేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉండగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల అంశంపైనా ఎస్ఈసీకి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ తీర్పు వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన పిటిషన్ లపై తీర్పులు ఎలా వచ్చాయో తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు దీనిపై ఉత్కంఠ కొనసాగుతున్నా ప్రభుత్వ నిర్ణయాలను తీసుకునే ముందే మంచి సలహాదారులు, న్యాయనిపుణులతో చర్చించి చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju