NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు బండారం బ‌య‌ట‌పెట్టిన జ‌గ‌న్‌…ఇప్పుడు జ‌ర‌గ‌బోయేది అదే

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న గురించి , అప్పుడు తీసుకున్న నిర్ణ‌యాలు , వాటి ఫ‌లితాల గురించి వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 

క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం వైఎస్‌ జగన్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త పాల‌న‌లోని ప‌లు అంశాల‌ను ఉద‌హ‌రించారు. రాబోయే కాలంలో తీసుకోబోయే నిర్ణ‌యాల గురించి తెలిపారు.

ఇళ్ల ప‌ట్టాల‌కు ఓకే …

డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేప‌ట్ట‌నున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. డిసెంబరు 25న డి–ఫామ్‌ ఇస్తూ, ఇంటి స్థలం పట్టాలు ఇస్తామ‌ని తెలిపారు. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జ‌ర‌గ‌నుంద‌ని, అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతామ‌ని ప్ర‌క‌టించారు.

బాబు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వలంటీర్లు వచ్చే వ‌చ్చే సోమ‌వారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వ లెటర్‌ తీసుకుని పోతారని సీఎం జ‌గ‌న్ చెప్పారు. “మీకు చంద్ర‌బాబు ముద్దా? జగన్‌ ముద్దా? అని అడుగుతారు. మీకు బాబు స్కీమ్‌ కావాలా? జగన్‌ స్కీమ్‌ కావాలా? అని కూడా అడుగుతారు. అందులో బాబు స్కీమ్‌లో ఏముంటుంది? జగన్‌ స్కీమ్‌లో ఏముంటుంది? అన్నది స్పష్టంగా రాయండి.“ అని తెలిపారు.

బాబు స్కీమ్ ఇది…

చంద్ర‌బాబు హ‌యాంలోని ప‌థ‌కం గురించి ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ తెలిపారు. “ఆయ‌న‌ స్కీంలో లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా వారికి అందుతుంది. “ అని తెలిపారు. మ‌న ప్ర‌భుత్వం కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్ చేస్తుంద‌న్నారు. “ ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్‌. ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్‌ కావాలన్నది తెలుసుకోండి.“ అంటూ చంద్ర‌బాబు పాల‌న గురించి సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

ఏపీలో క‌రోనా క‌థ ఏంటంటే…

కోవిడ్‌–19 గురించి ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించారు. “రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాము. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 91,54,263 పరీక్షలు చేయ‌గా అందులో 8.54 లక్షల పాజిటివిటీ కేసులు. 9.33 శాతం ప్రతి 10 లక్షల మందిలో 1,71,428 పరీక్షలు జ‌రిగాయి. పాజిటివ్ కేసులు కూడా గత నెలలో తగ్గాయి. కోవిడ్ నివారణ చర్యల్లో జిల్లాల కలెక్టర్లును అభినందించాలి.“ అని అన్నారు.

 

క‌రోనా గురించి కీల‌క వ్యాఖ్య‌లు

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించారు. “ యూరప్ మొత్తం కోవిడ్‌తో వణుకుతోంది. ఢిల్లీలో మరో లాక్‌డౌన్‌కు రెడీ. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్‌. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మ‌హమ్మారి వణికిస్తోంది. అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి, కలెక్టర్లు శ్రద్ద తీసుకోవాలి. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. “ అని స్ప‌ష్టం చేశారు.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju