NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పాపం నిమ్మగడ్డ…! కుర్చీ వేసి.., కోరలు పీకేశారు..!

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చేశారు. ఇక స్థానిక ఎన్నికలు నిర్వహించేస్తారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తారు. టిడిపికి, బిజెపికి అనుకూలం అయిపోతారు. ఆయన సామాజిక వర్గానికి మేలు చేసేస్తారు. అంటూ ఎంతో మంది నాయకులు ఎన్నో కలలు కని ఉంటారు.

 

jagan sensational decision pity nimmagadda

ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నది రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నప్పటికీ గడిచిన మూడు, నాలుగు నెలల్లో జరిగిన వ్యవహారాలన్నీ ఆయన చుట్టూ రాజకీయం, ఓ సామాజిక వర్గం వ్యవహారాలే ఎక్కువగా నడిచాయి. ఆయనను తిరిగి అదే కుర్చీలో కూర్చోబెట్టడంలో రాజకీయం, సామాజిక వర్గం గట్టిగానే పనిచేసిందని అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డ కు, నిమ్మగడ్డ తో సహా ఆయనకు అనుకూలంగా పని చేసిన పార్టీ లకు, నాయకులకు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నిమ్మగడ్డ కు కుర్చీ వేసినట్లే వేసి కోరలు పీకేసింది.

నిజం చెప్పుకోవాలంటే నిమ్మగడ్డకు పని లేనట్లే

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్. అంటే ఎన్నికలు జరిగితేనే ఆయనకు హోదా, అయన మాటకు బలం, అయన కుర్చీకి గళం. అయన చుట్టూ బలగం. ఎన్నో భజనలు అన్నీ చేరుతాయి. కానీ ఎన్నికలే లేకపోతే ఆయనకు ఇంక పనేముంది. అయన పని ఆయనదే. రాష్ట్ర ప్రభుత్వం పని రాష్ట్ర ప్రభుత్వం దే. ఏ పార్టీ పని ఆ పార్టీదే. ఇక మీదట అదే జరగనున్నది. ఎన్నో తిప్పలు పడి ఎన్నో పాయింట్ లు లాగి చివరకు ఓడిపోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అదే స్థానం లో నియమించిన ప్రభుత్వం మరో దెబ్బ కొట్టింది. ఆయనకు పని లేకుండా చేసింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పరోక్షంగా పై చేయి సాధించింది.

స్థానిక ఎన్నికలు వాయిదా.. ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ రోజే ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం చూసుకుంటే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేనట్లే. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కరోనా కూడా కారణం కావచ్చు. కానీ ప్రధాన కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ కుర్చీలో ఉండటమే. అందుకే ప్రస్తుతానికి స్థానిక సంస్థ ల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించిన ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిగిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుందా? అప్పటి వరకు వాయిదా వేస్తూ వస్తుందా? లేదా నిమ్మగడ్డ తో రాజీ ఫార్ములా కు వెళ్లి ఎన్నికలకు సై అంటుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సందేహమే. అయితే స్థానిక ఎన్నికలను ఎక్కువగా వాయిదా వేయడం కూడా ప్రభుత్వం చేతిలో పని కాదు. ఇప్పటికే రిజర్వేషన్ల అంశం,ఎన్నికలు ఆలస్యం అవడంపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసి మరి గడువు విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కరోనా కాలమని ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలను పూర్తి స్థాయిలో వాయిదా వేయాలన్నా కోర్టు లకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిందే. అది ఎలా జరుగుతుంది, ఏం చేస్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju