NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ వైసీపీ మంత్రి ఒక్కసారిగా రూటు మార్చడం చూసి జగనే షాక్ అయ్యాడు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి ఉన్న హవా మరే పార్టీకి లేదు. అసలు ఆ విషయంలో మరో పార్టీ దరిదాపుల్లోకి రాదు. ఇక ప్రాంతీయ పార్టీలను పక్కనబెడితే జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ పరిస్థితి ఎత్తకపోవడం మంచిది. భారతీయ జనతాపార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇంతకన్నా దుస్థితి వివరించడానికి ఏమీ లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 1.29 శాతం ఓట్లు రాగా వారి కంటే మరింత ఘోరంగా భారతీయ జనతా పార్టీకి 0.96 శాతం ఓట్లు వచ్చాయి.

 

Vellampalli slams TDP, JSP

పైన చెప్పిన లెక్క ప్రకారం అసలు ఏపీలో బీజేపీ నోరు ఎత్తకూడదు. వారికి ఉన్న బలం, బలగం ప్రాంతీయంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పోలిస్తే చీమ కి ఏనుగుకి ఉన్నంత తేడా ఉంటుంది. అయితే దేశాన్ని బిజెపి రెండోసారి ఏళుతుంది అన్న ఒకే ఒక్క కారణంతో ఇష్టం వచ్చినట్లు వైసిపి, టిడిపి అన్న తేడా లేకుండా బిజెపి నేతలు అధికార పార్టీ పై చెలరేగిపోతున్నారు. సి.బి.ఐ, ఈడీ లను గుప్పిట్లో పెట్టుకుని పాలక ప్రతిపక్ష పార్టీలను తన అదుపులో ఉంచుకొని ఏపీ పై బిజెపి అనధికార పెత్తనం సాగిస్తోంది. అయితే అధికార పార్టీ ఎంతసేపు టిడిపి, జనసేనలనే విమర్శిస్తూ వచ్చింది తప్పించి కొన్ని కారణాల వల్ల బిజెపి వైపు కి వెళ్ళలేదు. 

నిన్న విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు పై విరుచుకుపడ్డాడే తప్పించి బిజెపిని పల్లెత్తు మాట కూడా అనలేదు. రాజకీయంగా బిజెపితో సన్నిహితంగా కొనసాగాలన్న ధోరణితో వ్యవహరిస్తున్న వైసీపీవారికి రాష్టంలో మత విద్వేషాలను బిజేపీ సృష్టించాలని ప్రయత్నాలు మాత్రం మానడం లేదని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో శనివారం ఒక్కసారిగా జగన్ కే షాక్ ఇచ్చేలా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బీజేపీ పై ఆగ్రహం వెళ్ళగక్కాడు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాగా వేసేందుకు మతపరమైన అంశాలను తీసుకొస్తుందని ఆయన విమర్శించారు. అసలు ఎంత ధైర్యం వైసీపీకి ఎప్పుడు వచ్చింది అని అనుమానం కలిగేలా బిజెపిపై ఆయన ఫైర్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాగా వేసేందుకు మతపరమైన అంశాలను నిర్వహిస్తోందని మంత్రి విమర్శించారు. 2017 అక్టోబర్ 19న పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు లో రథం దగ్ధమైనా బీజేపీ – జనసేన భాగస్వాములుగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేశారు.  ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు దాని బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. అంతే కాకుండా ఇలా దేవాలయాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానేయాలని ఆయన సూచించారు.

ఇటీవల కాలంలో ఈ స్థాయిలో బిజెపి వైసిపి నాయకులపై ఎవరూ నోరెత్తలేదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ వెల్లంపల్లి దగ్గర్నుండి ఈ రియాక్షన్ కూడా ఊహించి ఉండడు అన్నది వైసిపి వర్గాల మాట. ఏదేమైనా ఇలా మాట్లాడడం వల అంతా మంచే జరిగిందని దీనివల్ల కేంద్రం దగ్గర తమ పేర్లు పెద్దగా చెడిపోవు అని వైసిపి వారు అంచనా వేస్తున్నారు. పైగా రాష్ట్ర బిజెపి కి తామేమి చేతులు మూడుచుకొని కూర్చోలేదని చెప్పినట్లు కూడా అవుతుందని మంత్రిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు అంతా.

author avatar
arun kanna

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju