NewsOrbit
న్యూస్

అంత దూరం డిల్లీ వెళ్ళి .. సుప్రీం కోర్టు నడిబొడ్డులో పప్పులో కాలేసిన జగన్ అండ్ కో ?? 

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి కోర్టుల రూపంలో తీవ్ర అసంతృప్తి ఎదుర‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో ఈ నిరాశ త‌ప్ప‌డం లేదంటున్నారు.

మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వం తీరును త‌ప్పుప‌డుతూ రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా బిల్లులపై హైకోర్డు స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అయితే అక్క‌డా స‌ర్కారు స‌మ‌న్వ‌య లోపంతో షాక్ ఎదురైంది.

రాజ‌ధాని విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం తీరును నిర‌సిస్తూ రైతులు హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి త‌దుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిష‌న్‌ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. అయితే, పిటిష‌న్‌లో త‌ప్పుల త‌డ‌క‌లు ఉండ‌టంతో విచార‌ణ‌కు రాలేద‌ని స‌మాచారం. ప‌లు త‌ప్పులు ఈ పిటిష‌న్‌లో ప్ర‌స్తావించినట్లు తెలుస్తోంది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారని, ఉత్తర్వులను పిటిషన్‌కు జత చేయలేదని స‌మాచారం. మ‌రోవైపు త‌ప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా స‌మాచారం.

ఇదిలాఉండగా, ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖలో ఈనెల 16 వ తేదీన మొదట శంకుస్థాపన చేయాలని భావించినా… ఆ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దీనికి కార‌ణం కోర్టు కేసులు, వివిధ ర‌కాల అనుమ‌తులు రాక‌పోవ‌డం అని తెలుస్తోంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టం, వివిధ అంశాల్లో కొన‌సాగుతున్న అస్ప‌ష్ట‌త నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు సుప్రీంకోర్టులో స్టే ఆశ‌లు స‌న్న‌గిల్ల‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!