NewsOrbit
న్యూస్

మళ్లీ ఫెయిల్ అవబోతున్న జగన్ ‘విజయదశమి” ముహూర్తం! కారణం పెద్దదే!!

ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో గానీ అన్నీ ఆయనకి అడ్డంకులే ఎదురవుతున్నాయి.

Jagan 'Vijayadashami' is about to fail again The reason is big
Jagan ‘Vijayadashami’ is about to fail again The reason is big

ఏదో విధంగా సాంకేతిక కారణాలు చూపి శాసనమండలి తిరస్కరించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న జగన్ సంతోషం అంతలోనే ఆవిరయిపోయింది. ఆ విషయం కోర్టుకెళ్లింది.మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో యాభైకి మించి పడిన పిటిషన్లు పెద్ద ఎత్తున బ్రేకులేస్తున్నాయి. వరస స్టేలతో ఇపుడు హైకోర్టులో మూడు రాజధానుల చట్టం ఇరుక్కుపోయినట్లైంది. విచారణ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు పెద్ద సంఖ్యలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పిటిషన్లు ఉన్నాయి. అన్నీ కలిపి విచారించినా కూడా చాలా సమయమే పట్టేట్లు ఉంది.

మరో వైపు సుప్రీంకోర్టు అయితే మూడు రాజధానుల చట్టం అమ‌లు చేసేందుకు వీలుగా హైకోర్టు విధించిన స్టేను తొలగించలేమని చెప్పేసింది. ఇక హైకోర్టు తీర్పు కోసమే జగన్ సర్కార్ ఎదురు చూడాలి .అయితే ఇదంతా ఊహించని జగన్ ప్రభుత్వం విశాఖపట్నం కి రాజధాని తరలింపునకు విజయదశమి రోజున అంటే అక్టోబర్ 25వ తేదీన ముహూర్తం కూడా పెట్టుకుందంట. విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామీజీ ఈ మహత్తరమైన ముహూర్తం పెట్టారని కూడా చెబుతారు. ఇప్పటికి నుంచి చూస్తే విజయదశమికి ఎక్కువ దూరం లేదు. కానీ హైకోర్టులో విచారణ సెప్టెంబర్ 21 తరువాత మొదలవుతుందని అంటున్నారు. అక్కడ ఎంత త్వరగా విచారణ జరిపినా అక్టోబర్ విజయదశమి ముహూర్తం కూడా దాటిపోయేలా ఉంది. దాంతోనే వైసీపీలో మధనం మొదలైందని అంటున్నారు.

ఇపుడు న్యాయపరమైన చిక్కులు ఉండడంతో 2020 లో విశాఖకి రాజధానికి జగన్ వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదన్న విశ్లేషణలు ఉన్నాయి.ఇక 2021లో చూసుకుంటే ఒకవేళ హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమరావతి రాజధాని జేఏసీ సుప్రీం కోర్టు తలుపు తట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి అక్కడ ఈ కేసు ఎన్నాళ్ళు పడుతుందో దేవుడికే ఎరుక. అంటే మొత్తానికి జగన్ మూడు రాజధానుల ముచ్చట ఇప్పట్లో తీరేది కాదని కచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు.ముఖ్యమంత్రి జగన్ కి ఇది బాగా నిరాశ కలిగించే ముచ్చటే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

author avatar
Yandamuri

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju