తిరుపతి ఉప ఎన్నికల కి జగన్ లేటెస్ట్ అస్త్రం..!!

Share

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుపతి ఎంపీ వైసిపి నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఉప ఎన్నికలు షురూ అవటంతో ప్రధాన పార్టీలు అన్నీ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

Justice Lalit recuses from hearing plea seeking removal of AP CM Jagan Reddy - Oneindia Newsమరోపక్క బిజెపి దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు భారీ స్థాయిలో రాణించడంతో ఏపీలో కూడా అదే రీతిలో రాణించాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇటువంటి తరుణంలో అధికార పార్టీ వైసిపి తిరుపతి ఉప ఎన్నికలకు తాజాగా రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఉపఎన్నికలకు జగన్ లేటెస్ట్ అస్త్రాన్ని ప్రయోగించిడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళితే సరిగ్గా ఉప ఎన్నికలకు ముందు ఇళ్ల స్థలాల లేకపోతే ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తూ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీలో టాక్. ఈ నెల 25న చిత్తూరు జిల్లా నుండే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాల కార్యక్రమం చిత్తూరు నుండి లేదా శ్రీకాళహస్తి నుండి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మించి వాటికి జగనన్న కాలనీలు అనే నామకరణం కూడా చేయాలని వైసిపి పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కార్యక్రమం చిత్తూరు నుండి స్టార్ట్ చేసి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పొలిటికల్ ఎత్తుగడతో ప్రత్యర్థులు ప్రజల ముందు పలచన పడిపోతారని ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం రావటం గ్యారెంటీ అని వైసిపి హైకమాండ్ భావిస్తోందట.


Share

Related posts

JAGAN: ఏదైనా వ్యాపారానికి ఋణం కావాలా ? వై ఎస్ జగన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఉపయోగించుకోండి , ఇలా అప్లయ్ చేసుకోండి !

Ram

Ramya Subramanian Latest HD photos

Gallery Desk

ఆ ఫైర్ బ్రాండ్ మహిళా నేత కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లేనా..?ముహూర్తం ఎప్పుడో..!!

somaraju sharma