NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మాస్టర్ ప్లాన్ పవన్ కు ముందే తెలిసిపోయింది…! కానీ ఏమీ చేయలేకపోతున్నాడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయంగా చూసుకుంటే ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తున్నప్పుడే రైతుల తరఫున నిలబడ్డారు. అప్పుడు భూములను ఇస్తున్న రైతుకి భరోసా ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన మద్దతుదారు అయినప్పటికీ భూసేకరణ విషయంలో తప్పులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లి రైతులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో ఎవరైనా కచ్చితంగా మెచ్చుకోవాలి.ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు రైతులను ఉద్దేశించి 2015 ఆగస్టు 23న అమరావతి లో మాట్లాడుతూ “వేల మంది రైతులు వాళ్ల నమ్మకాన్ని, భవిష్యత్తును,, వారి పిల్లలను వారి తర తరాల భవిష్యత్ ను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ని నమ్మి అమరావతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే…

అప్పుడు మంత్రి నారాయణ గారు ఉండరు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉండరు. అప్పుడు భూములిచ్చిన రైతులకు న్యాయం చేసేందుకు రాజ్యాంగపరమైన భద్రత ఏముంది…? కీడెంచి మేలెంచమన్నారు కదా…? మరి దీనికి సమాధానం ఏమిటి?” అని ప్రశ్నించారు.అప్పుడు అమరావతి విషయం పై వైసీపీ అజెండా అందరూ అనుకుంటున్నట్లు మరీ అంత అనుకూలంగా ఏమీ లేదు. వారు కేవలం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని జిల్లాల మధ్య చిచ్చు పెట్టడం తమకు ఇష్టం లేదని చెప్పారే గానీ తాము వస్తే అదే జిల్లాలకు న్యాయం చేకూర్చేలా… సమాంతరంగా వ్యవహరించబోమని కూడా ఎక్కడా చెప్పలేదు.

దీనినే పసిగట్టిన పవన్… అప్పుడు తెలుగుదేశం పార్టీని ఇదే విషయమై నిలదీశారు. అయితే అతను ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం…. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసిపి బంటుగా వ్యవహరించడం పవన్ కు పూర్తిగా పవర్ లేకుండా చేశాయి. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలు చేసే బిజెపిలో చేరడం కూడా ఇప్పుడు అతనికి పెద్ద మైనస్ అయిపోయింది. ఎటు చూసుకున్నా పవన్ మళ్ళీ రాజకీయాల్లో తనకంటూ ఒక పేరు సంపాదించి నిలదొక్కుకోవాలంటే కొత్త మార్గం వెతకాల్సిందే.

author avatar
arun kanna

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!