Jagapathi Babu: సీనియర్ యాక్టర్ హీరో జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెయిన్ రోల్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల పక్కన అదే రీతిలో తండ్రి మరియు కీలకపాత్రలు జగపతి బాబు చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబు ఉ నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ తండ్రిగా నటించిన జగపతిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన “రంగస్థలం” సినిమా లో విలన్ పాత్రలో అదే రీతిలో… ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ, నాన్నకు ప్రేమతో సినిమా లో జగపతి బాబు విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. లెజెండ్ సినిమాలో కూడా బాలకృష్ణ కి ప్రతినాయకుడిగా నటించారు.
అయితే ఇప్పుడు మరో బిగ్గెస్ట్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర పోషించడానికి జగపతి బాబు రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న కాదు. విషయంలోకి వెళితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో… తెరకెక్కుతున్న సినిమా “సలార్” లో.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు.. సినిమాకే హైలెట్ పాత్ర దిశగా.. అన్నట్టు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.
హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే జగపతిబాబు పాల్గొనబోతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా షూటింగ్ లు చాల ఆలస్యం అవ్వుతూ ఉండటంతో.. త్వరగా చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయాలనీ ప్రభాస్ “సలార్” షూట్ లో పాల్గొంటున్నారట.