Jagapathi babu: నటుడు జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ సపోర్టింగ్ పాత్రలు చేస్తూనే మరోపక్క విలన్ పాత్రలు కూడా చేస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ, రంగస్థలం వంటి సినిమాలలో జగపతిబాబు చేసిన విలన్ క్యారెక్టర్ ను ఇటీవల హైలెట్ గా నిలిచాయి. అంతకు ముందు లెజెండ్ సినిమాలో కూడా బాలకృష్ణ కి ప్రత్యర్థిగా జగపతి బాబు చేసిన క్యారెక్టర్.. సినిమా మొత్తానికి హైలెట్గా నిలిచింది.. చాలావరకు కధర్ బట్టలలో కనిపిస్తూ వెండితెరపై అలరిస్తున్న జగపతిబాబు.. తాజాగా పొలిటికల్ ఎంట్రీ అంటూ తనపై వస్తున్న వార్తలకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
తెల్లటి ఖద్దరు బట్టలు వేసుకున్నంత మాత్రాన అందరూ రాజకీయ నాయకులు అయిపోరు.. ముఖ్యంగా తనని సినిమాలలో తెల్లబట్ట లో చూసి పొరపాటున రాజకీయాల్లోకి వస్తున్నట్లు.. ఎవరు భావించవద్దు అని అటువంటి చాన్స్ భవిష్యత్తులో కూడా ఉండదని.. జగపతిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ కామెంట్ పెట్టిన క్రమంలో ఫోటో కూడా తెల్ల కుర్తా పైజామా ధరించి.. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గోడ పై కూర్చుని ఫోజ్ ఇవ్వడం జరిగింది.
Read more: Jagapathi Babu: సరికొత్త రంగంలోకి అడుగు పెడుతున్న జగపతి బాబు..??
ఈ క్రమంలో నెటిజెన్లు అభిమానులు ప్రశ్నలు వేస్తున్న తరుణంలో ఒక అభిమాని జగ్గు భాయ్ పొలిటికల్ లీడర్.. అన్న తరహాలో కామెంట్ పెట్టిన క్రమంలో జగపతిబాబు.. సమస్య లేదు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావడం అనేది ఉండదు అని తేల్చేశాడు. దీంతో చాలా మంది అభిమానులు నెటిజన్లు సరైన నిర్ణయం ఇది.. మమ్మల్ని ఈ విధంగానే సినిమాల్లో నటిస్తూ అలరించండి ఉంటూ జగపతి బాబు ని కోరుతున్నారు.