RRR : మగధీర ప్లాన్స్ మళ్లీ ఆర్ఆర్ఆర్ కి అప్లై చేస్తున్న జక్కన్న

Share

RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఓ భారీ స్కెచ్ వేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది గతంలో ఆయన దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి ఉపయోగించిన ప్లాన్ లాంటిదే అని సమాచారం. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్స్ గా తెరకెక్కుతోంది. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

jakkanna is applying magadheera plans to rrr
jakkanna is applying magadheera plans to rrr

కాగా ఈ మూవీ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకొని దానికి ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాను యాడ్ చేసి జక్కన్న రూపొందిస్తున్నారు. ఇక ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేసే పనిలో ఉన్నారట జక్కన్న. అందుకు మూడు నెలల ముందుగానే ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.

RRR : టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, మెగాస్టార్, రానా సహా పలువురు హీరోలు, హీరోయిన్స్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ‘రోర్ ఆఫ్ ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ పేరుతో ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమా మీద ఊహకందని అంచనాలను పెంచారు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ ని సిద్దం చేస్తున్నారని తాజాగా టాక్ మొదలైంది. ‘మగధీర’ మూవీలో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే సాంగ్ లాగానే, ఈ సాంగ్ కూడా ఎండింగ్‌లో వస్తుదట. ఇక ఇప్పటికే కీరవాణి ట్యూన్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, మెగాస్టార్, రానా సహా పలువురు హీరోలు, హీరోయిన్స్ కనిపించబోతున్నట్టు
తెలుస్తోంది. దీనిపై త్వరలో మరింత సమాచారం రానుందట.


Share

Related posts

మందిర నిర్మాణానికి మంచి తరుణం

Siva Prasad

నిమ్మగడ్డపై ప్రొఫెసర్… మాగ్జిమం క్లారిటీ వచ్చేస్తోంది!

CMR

వాళ్ల కంట ఒకసారి కనబడండి చిన్న బాబు గారు గొడవ గొడవ చేస్తున్నారు..??

sekhar