RRR : ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్.. ఫైనల్ సాంగ్ షూట్‌లో జక్కన్న టీం..

Share

RRR : ఆర్ఆర్ఆర్.. ఫైనల్ షూట్ మొదలైంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తూ సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ కోసం గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విజయదశమి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారకంగా చిత్ర బృందం ఇంతకముందే ప్రకటించారు.

jakkanna team in rrr-final song shoot at ukraine
jakkanna team in rrr-final song shoot at ukraine

దాంతో కరోనా వేవ్స్ ని తట్టుకుంటూ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు రాజమౌళి బృందం. ఒకే ఒక్క పాట తప్ప మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఆ ఒక్క సాంగ్ ను పూర్తి చేసేందుకు రాజమౌళి బృందం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కొసం ఉక్రెయిన్ వెళ్ళింది. చివరి పాట చిత్రీకరణ మొదలు పెట్టగా షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు మిగతా ముఖ్య తారాగణం షూట్ లో జాయిన్ అయ్యారని సమాచారం. కాగా ఈ సాంగ్ కోసం రాజమౌళి రెండు వారాలు కేటాయించారని తెలుస్తోంది. ఈ రెండు వారాలలో సాంగ్ పూర్తి చేసి అక్కడే గుమ్మడికాయ కొట్టనున్నారట.

RRR : రాజమౌళి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరీస్, సముద్రఖని సహా పలువురు ఇతర భాషలలోని నటీ నటులు కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 భాషలల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మిగతా భాషలలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతకి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి లాభాలలోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాహుబలితో సంచలనం సృష్ఠించిన రాజమౌళి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.


Share

Related posts

Nimmagadda : టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎస్ఈసీ నిమ్మగడ్డకు చెడింది..? ఫ్రూఫ్ ఇదే..!!

somaraju sharma

NTR: ఆగస్టు 15వ తారీకు నుండి సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్..??

sekhar

Mahesh Babu : అదరగొడుతున్న సూపర్ స్టార్ మహేష్ వర్కింగ్ స్టిల్..!!

sekhar